అంగన్‌వాడీ సేవలు విస్తరించాలి
● జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం
సిరిసిల్ల: అంగన్‌వాడీ కేంద్రాల సేవలను విస్తరించాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరారు. సిరిసిల్లలోని అంబేడ్కర్‌నగర్, బీవై నగర్ సెక్టార్లలో మంగళవారం జరిగిన అంగన్‌వాడీ టీచర్ల సమీక్ష సమావేశంలో మాట్లాడారు. పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు రప్పించడం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందుతుందన్నారు. ఉచితంగా మధ్యాహ్న భోజనం, ఆంగ్ల మాధ్యమంలో విద్యనందిస్తామని ప్రజలకు వివరించాలని సూచించారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని సరిచేసేందుకు ప్రత్యేక బాలామృతం అందిస్తామన్నారు. కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్లే మెటీరియల్, స్మార్ట్ టీవీలు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నాయని వివరించారు. గత నెలలో రిటైర్మెంట్ పొందిన ఇద్దరు టీచర్లు, ఒక ఆయాను సన్మానించారు. సూపర్‌వైజర్లు దివ్య, సుస్మిత తదితరులు పాల్గొన్నారు.


