అంబేడ్కర్‌ ఆశయాలు ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ ఆశయాలు ఆదర్శం

Apr 14 2025 12:23 AM | Updated on Apr 14 2025 12:23 AM

అంబేడ్కర్‌ ఆశయాలు ఆదర్శం

అంబేడ్కర్‌ ఆశయాలు ఆదర్శం

● బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ

సిరిసిల్లటౌన్‌: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ఆశయాలు ప్రపంచానికి ఆదర్శమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ పేర్కొన్నారు. ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. సిరిసిల్లలోని అంబేడ్కర్‌విగ్రహాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో శుద్ధి చేసి దీపాలతో అలంకరించారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్‌, రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌ మ్యాన రాంప్రసాద్‌, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్‌యాదవ్‌, కరీంనగర్‌ పార్లమెంటు కో–కన్వీనర్‌ ఆడెపు రవీందర్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, అంబేడ్కర్‌ జయంతి కన్వీనర్‌ చంటి మహేశ్‌, కో కన్వీనర్‌ కొంపల్లి రాజేందర్‌, యాదగిరి శ్రీమతి, పల్లం అన్నపూర్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement