జలవనరులను రక్షించుకోవాలి
వేములవాడఅర్బన్: జలవనరులను రక్షించుకోవాలని ఉమ్మడి జిల్లా యూత్ అధికారి వెంకట రాంబాబు కోరారు. అగ్రహారం డిగ్రీ కాలే జీలో శనివారం అవగాహన కల్పించారు.
● సిరిసిల్ల బల్దియా.. పరిశుభ్రత లేదయా ● పేరుకుపోతున్న డస్ట్‌బిన్స్ ● కంపుకొడుతున్న అంతర్గతకాలనీలు ● గత స్వచ్ఛకీర్తి కొనసాగేనా..?
మోరీలు కంపుకొడుతున్నాయి
మోరీలు కంపు కొడుతున్నాయి. మా వీధిలో చెత్త వేయడానికి డస్ట్‌బిన్స్ లేక రోడ్డు పక్కనే పడేస్తున్నారు. ఇక మోరీల్లో బాటిళ్లు, డైపర్స్ పడేయడంతో నీరు నిలుస్తుంది. వర్షం పడితే మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుంటుంది.
– మసూరి గోపి, అనంతనగర్
టోల్ ఫ్రీ నంబర్ పెట్టాలి
మా వాడలో మోరీలోంచి తీసిన సిల్టును మూడు రోజుజులైనా తొలగించడం లేదు. చెత్త సేకరణలో నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేసేందుకు అధికారులు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి.
– బియ్యంకార్ శ్రీనివాస్, సిద్దులవాడ
చెత్త సేకరణపై దృష్టి పెట్టాలి
వార్డుల్లో చెత్తసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో పారిశుధ్య పనులు బాగా జరిగేవి. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. వార్డులకు ప్రత్యేక ఆఫీసర్‌లు ఉన్నా క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు.
– సుల్తాన్ బాలరాజు, 12వ వార్డు
నిర్లక్ష్యం లేదు
పట్టణంలో పారిశుధ్య పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేదు. నిత్యం ప్రణాళికాబద్ధంగా చెత్త సేకరిస్తున్నాం. అన్ని వార్డుల్లో ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా ఇబ్బంది తలెత్తితే ప్రజలు ‘సిటిజెన్ బడ్డీ’ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే పరిష్కరిస్తాం. స్వచ్ఛ సిరిసిల్ల కీర్తి కొనసాగుతుంది.
– ఎస్.సమ్మయ, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్
● ఇది సిరిసిల్లలో నిత్యం ఇంటింటికి వెళ్లి పారిశుధ్య సిబ్బంది ట్రాక్టర్‌లో చెత్తను సేకరిస్తున్నారు. తడి, పొడి, హానికర చెత్తలుగా విడదీసి ప్రజలు అందిస్తుంటారు. 39 వార్డుల్లో నిత్యం 40 టన్నులకు పైగా చెత్త వస్తుంటుంది.
● ఇది కొత్తబస్టాండ్ ప్రాంగణంలోని చెత్తడబ్బాలు. ఇందులో ఒకటి విరిగిపోయి నిరుపయోగంగా మారింది. అప్పట్లో వీటి కోసం సుమారు రూ.15లక్షలు వెచ్చించారు. వీటితోపాటు పట్టణ వ్యాప్తంగా లిఫ్టింగ్ డస్ట్‌బిన్‌లు, సాధారణ డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేశారు. కానీ చాలా డస్ట్‌బిన్లు ప్రస్తుతం పాడయ్యాయి.
సిరిసిల్ల మున్సిపల్ సమాచారం
జనాభా : 1.11 లక్షలు
వార్డులు : 39
శానిటేషన్ సిబ్బంది : 277
ప్రతిరోజు చెత్త ఉత్పత్తి : 52 మెట్రిక్ టన్నులు
సేకరిస్తున్న చెత్త : 48 మెట్రిక్ టన్నులు
ప్రతిరోజు ప్లాస్టిక్ పదార్థాల ఉత్పత్తి : 12 టన్నులు
చెత్తశుద్ధి కరువాయే..
చెత్తశుద్ధి కరువాయే..
చెత్తశుద్ధి కరువాయే..
చెత్తశుద్ధి కరువాయే..
చెత్తశుద్ధి కరువాయే..
చెత్తశుద్ధి కరువాయే..
చెత్తశుద్ధి కరువాయే..
చెత్తశుద్ధి కరువాయే..