● సిరిసిల్ల డీఎం ప్రకాశ్‌రావు
సిరిసిల్లటౌన్: శ్రీరామనవమి సందర్బంగా భక్తుల చెంతకే భద్రాచలం సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలనుకార్గో ద్వారా అందిస్తున్నామని ఆర్టీసీ సిరిసిల్ల డీఎం ప్రకాశ్‌రావు తెలిపారు. స్థానిక బస్‌స్టేషన్‌లో బుధవారం తలంబ్రాల బుకింగ్ రశీదు పుస్తకాలను ఆవిష్కరించారు. బుకింగ్ కోసం 91542 98576, 91542 98577, 94924 48189 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
‘డబుల్’ లబ్ధిదారుల నుంచి తాళాలు వాపస్
ఇల్లంతకుంట(మానకొండూర్): అనుమతి లేకుండా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలోకి ప్రవేశించిన వారి నుంచి తాళాలను తహసీల్దార్ ఫారుక్ తీసుకున్నారు. కొందరు లబ్ధిదారులు ఇళ్ల పంపిణీలో జాప్యం చేస్తున్నారని మంగళవారం ఆక్రమించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్, ఎస్సై శ్రీకాంత్‌గౌడ్, ఆర్‌ఐ షఫీ, వీఆర్వో సింగారెడ్డిలతో కలిసి మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్దకు వెళ్లారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను పరిశీలించి తిరిగి వచ్చారు. బుధవారం ఉదయం తహసీల్దార్ ఆఫీస్‌కు అక్రమంగా ప్రవేశించిన లబ్ధిదారులను పిలిపించి నచ్చజెప్పారు. మౌలిక వసతులు పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతులమీదుగా అందజేస్తామని హామీ ఇచ్చారు.
టీబీ నిర్మూలనకు కృషి చేయాలి
● టీబీ అలర్ట్ ఇండియా ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాను టీబీ రహితంగా మార్చడానికి కృషి చేయాలని టీబీ అలర్ట్ ఇండియా ఆర్గనైజేషన్ ప్రోగ్రాం అధికారి దండుబోయిన శ్రీనివాస్ కోరారు. మండలంలోని వెంకటాపూర్, నారాయణపూర్, బండలింగంపల్లి, కిషన్‌దాస్‌పేట, ఎల్లారెడ్డిపేట, రాచర్లబొప్పాపూర్ సబ్‌సెంటర్ల వైద్య సిబ్బందితో టీబీ నివారణపై స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం అవగాహన కల్పించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అధికసంఖ్యలో కేసులు ఇండియాలోనే నమోదవుతున్నాయన్నారు. టీబీని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. టీబీ వ్యాధి నిర్మూలనకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాలు ఎంపిక చేయగా.. రాజన్నసిరిసిల్ల ఒక్కటన్నారు. టీబీ బారిన పడి జయించిన వారిని టీబీ చాంపియన్‌గా గుర్తించి శిక్షణ ఇచ్చి ప్రచారం చేయాలని సూచించారు. వైద్యాధికారి సారియా అంజుమ్, టీబీ సూపర్‌వైజర్ పద్మ, ఏఎన్‌ఎంలు, ఆశకార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
సీఎమ్మార్ లక్ష్యం పూర్తి చేయాలి
● అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్
సిరిసిల్ల: కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) లక్ష్యం గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ కోరారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లాలోని రైస్‌మిల్లర్లతో సమావేశమయ్యారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడుతూ జిల్లాలోని రైస్‌మిల్లర్లు రబీ సీజన్ 2023–24లో దిగుమతి చేసుకున్న 2,56,343 టన్నుల ధాన్యానికి 1,74,313 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 1,43,656 టన్నులు ఇచ్చారని వివరించారు. ఖరీఫ్ 2024–25 సీజన్‌లో దిగుమతి చేసుకున్న ధాన్యం 2,11,572 టన్నులకు బియ్యం 1,42,150 టన్నులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి దాకా 21,103 టన్నులు మాత్రమే అందించారని పేర్కొన్నారు. రైస్‌మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలని, రోజు వారీ లక్ష్యాలు నిర్ణయించి, సమీక్షించాలని పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. డీఎస్‌వో వసంతలక్ష్మి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రజిత, రైస్‌మిల్లర్ల ప్రతినిధులు గరిపెల్లి ప్రభాకర్, మల్లేశం, శ్రీకాంత్ పాల్గొన్నారు.
భక్తుల చెంతకే సీతారాముల తలంబ్రాలు
భక్తుల చెంతకే సీతారాముల తలంబ్రాలు
భక్తుల చెంతకే సీతారాముల తలంబ్రాలు