వేములవాడఅర్బన్: వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేటలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏక్ భారత్.. శ్రేష్ట భారత్‌లో భాగంగా మంగళవారం వేషధారణలతో పాఠశాలకు హాజరయ్యారు. హెచ్‌ఎం శ్రీకాంత్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సర్వీసు పర్సన్ సస్పెన్షన్
చందుర్తి(వేములవాడ): మండలంలోని నర్సింగపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సర్వీసు పర్సన్‌గా పనిచేస్తున్న బండి రాకేశ్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మండల విద్యాధికారి వినయ్‌కుమార్ తెలిపారు. పాఠశాల ఆవరణలో మద్యం తాగుతూ విద్యార్థులను చెడు వ్యవసనాలకు మళ్లిస్తున్నారన్న ఆరోపణల మేరకు సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
ఇటలీలో ఎల్లారెడ్డిపేట వాసి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉపాధి కోసం ఇటలీ దేశానికి వెళ్లిన ఓ వలస జీవి రోడ్డు ప్రమాదంలో ప్రా ణాలు కోల్పోయాడు. ఈ సంఘటన స్వగ్రామంలో విషాదం నింపింది. ఎల్లారెడ్డిపేటకు చెందిన మహ్మద్ రషీద్(47) రెండేళ్ల క్రితం ఇటలీకి వెళ్లాడు. కారు డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురై సోమవారం రాత్రి మృతిచెందాడు. ఈ విషయం అక్కడి మిత్రులు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా మంగళవారం సమాచారం అందించారు. రషీద్ కుటుంబ సభ్యులు కొంతకాలంగా సిద్దిపేటలో ఉంటున్నారు. రషీద్ మృతదేహం బుధవారం ఎల్లారెడ్డిపేటకు రానుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ
వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధి శాత్రాజుపల్లి రహదారిలోని తెలంగాణ సోషల్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలోని విద్యార్థినిలు క్రీడాపోటీల్లో ప్రతిభ చూపారు. వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఎన్‌వైకేఎస్ జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. కబడ్డీలో రమ్య, శైలజ, శృతి, రోజా, గౌతమి, గీతాంజలి, శృతి, వాలీబాల్‌లో శ్రావణి, కీర్తి, వెన్నెల, శ్రీజ, ప్రవళ్లిక, నేహ, రన్నరప్ జట్టులో హారిక, మానస, కావ్య, శృతి, అఖిల, అక్షయ, మాళవిక, 200 మీటర్ల రేసులో వర్షిత, చైత్రిక విజయం సాధించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ లావణ్య, వైస్ ప్రిన్సిపాల్ సుమలత, దేవిక, అభినందించారు.
దుబాయ్‌లో ఉద్యోగాలు.. ఐటీఐలో రిజిస్ట్రేషన్లు
సిరిసిల్లకల్చరల్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఆధ్వర్యంలో నైపుణ్యం గల నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నిర్ణయించింది. ఈమేరకు యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్(దుబాయి)లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి ఆసక్తి గల యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నటు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ సరిత ప్రకటనలో తెలిపారు. సిరామిక్ కాప్టర్‌జూనియర్ ప్రాసెస్ ఆపరేటర్, ప్రెస్ మెకానిక్, పాలిసింగ్ మెకానిక్, డిజైనర్, ప్రొడక్షన్ సూపర్‌వైజర్, బాడీ ప్రిపరేషన్ ఇన్‌చార్జ్, పోర్క్ లిఫ్ట్ ఆపరేటర్, షవల్ ఆపరేటర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. తంగళ్లపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రిజిస్ట్రేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు www.tomcom.telanga na.gov.in వెబ్‌సైట్‌లో లేదా 94400 49937లో సంప్రదించాలని సూచించారు.
ఏక్ భారత్.. శ్రేష్ట భారత్
ఏక్ భారత్.. శ్రేష్ట భారత్