ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని గూడెంలో శ్రీపద్మావతీవేంకటేశ్వరస్వామి కల్యాణ వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం విష్ణు సహస్ర పారాయణం చేశారు. పూర్ణాహుతి, బలిహరణం చేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ శాశ్వత చైర్మన్ చిట్నేని వెంకటేశ్వర్‌రావు, అధ్యక్షుడు గంభీరావుపేట బాలయ్య, సరిత, రఘుపతిరావు, అంజన్‌రావు, శ్రీనివాస్‌రావు, శ్రీధర్, గిరి, విద్యాసాగర్‌రావు, విష్ణు, మల్లేశ్, లక్ష్మయ్య, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.