న్యూస్‌రీల్
నిప్పుల కొలిమిలా మారిన ఉమ్మడి జిల్లా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు ఇప్పటికే కంభంలో 45.7 డిగ్రీలు నమోదు ఉదయం 10 దాటిన తర్వాత బయటకు రావాలంటే భయపడిపోతున్న జనం అక్కడక్కడా అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంటలకు నష్టం ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వానలతో విచిత్ర వాతావరణం
జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గత నెల 27వ తేదీ కంభంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.7 డిగ్రీలు నమోదు కావడం తెలిసిందే. అదేరోజు మార్కాపురం జిల్లాలోని 15 మండలాల్లోని 9 మండలాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైనట్లు రికార్డులు చెబతున్నాయి. అంతకుముందు రోజు, ఆ తరువాత రోజు కూడా మార్కాపురం జిల్లా తీవ్రమైన ఎండలతో నిప్పుల కొలిమిలా మారింది. శుక్రవారం మార్కాపురం జిల్లాలోని మండలాలన్నింట్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. మార్కాపురంలో 43 డిగ్రీలు నమోదు కాగా కనిగిరి 43, గిద్దలూరు 43, కంభం 43 డిగ్రీలు నమోదయ్యాయి. పామూరు 42, దోర్నాల 42 డిగ్రీలు నమోదైంది. ప్రకాశం జిల్లాలో మాత్రం ఒక్క దర్శిలో మాత్రమే 43 డిగ్రీలు నమోదు కాగా ఒంగోలు 42.1, కందుకూరు 42, అద్దంకి 41, సింగరాయకొండ 41, చీమకుర్తిలో 42, సముద్రతీర ప్రాంతమైన కొత్తపట్నంలో 41 డిగ్రీలు నమోదైంది.
ఎండలు మండిపోతున్నాయి. ఉమ్మడి జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. పశ్చిమ ప్రాంతంలో హీట్‌వేవ్స్ భయపెడుతున్నాయి. దాదాపు అన్ని మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే కంభంలో రికార్డు స్థాయిలో 45.7 డిగ్రీలు నమోదైంది. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో 43 నుంచి 42 డిగ్రీలు నమోదయ్యాయి. ఒకవైపు అదిరిపోయే ఉష్ణోగ్రతలు, ఊపిరాడని ఉక్కపోత, వడగాడ్పులు, మరోవైపు గాలివానతో అకాల వర్షాలు, వడగండ్ల వానతో పంట నష్టాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా విచిత్ర వాతావరణం నెలకొంది.
ఒంగోలు: విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ పర్వతరెడ్డి ఆనంద్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శుక్రవారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. శారీరక దృఢత్వం, మానసిక వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి జి.రాజరాజేశ్వరి, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.సురేష్, రాష్ట్ర కరాటే అసోసియేషన్ కార్యదర్శి ఎన్.మోహన్‌రావు, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: జిల్లా నూతన జడ్జి ఏ.సత్యానంద్‌ను ఎస్పీ హర్షవర్థన్ రాజు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయశాఖ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై ఇరువురు చర్చించారు. న్యాయ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తే దోషులకు త్వరితగతిన శిక్షలు పడి నేరాలు తగ్గుముఖం పడతాయని, పోలీసు శాఖ తరుపున బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎస్పీ తెలిపారు.
ఒంగోలు సిటీ: స్థానిక వీఐపీ రోడ్డులోని ప్రధానోపాధ్యాయుల సంఘ భవనంలో శనివారం ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం, ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, లక్ష్మీనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిలర్లు అందరూ సమావేశంలో పాల్గొనాలని కోరారు. విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చలో పాల్గొని తదుపరి జరిగే ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఒంగోలు సిటీ: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 2వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఒంగోలులోని పాత జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు సీఈఓ బి.చిరంజీవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
ఉమ్మడి జిల్లాలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఒకవైపు మండిపోయే వర్షాలు, మరోవైపు గాలివానతో వర్షాలు కురుస్తుండటంతో భిన్నవాతారణం కనిపిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకుని చల్లబడింది. ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, దోర్నాల మండలాల్లో వడగండ్ల వాన పడింది. గాలివాన దెబ్బకు పంటలు దెబ్బతిని రైతులకు తీరని నష్టం జరిగింది. చేతికి అందివచ్చిన అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగాయి. తీవ్రంగా వీచిన గాలులకు ఒక్క దోర్నాల మండలంలోని బొమ్మలాపురం గ్రామంలోనే 100 ఎకరాలకుపైగా అరటి, బొప్పాయి పంటలకు నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. పట్టణాల్లో ఈదురు గాలులకు దుకాణాల మీద కప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపోయి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఒంగోలు టౌన్:
రోహిణి కార్తెకు ముందే ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమంటున్నాడు. సాధారణంగా రాష్ట్రంలో ఏటా రెంటచింతలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అందుకు విరుద్ధంగా ఈ ఏడాది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లో ఉక్కపోత, బయట సూర్యప్రతాపంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.
గత ఏడాది కంటే 6 డిగ్రీలు అధికంగా ఎండ...
జిల్లా కేంద్రమైన ఒంగోలు నాలుగు రోజులుగా నిప్పుల కొలిమిలా మారింది. నింగిలోని సూర్యుడు నేలమీదకు దిగివచ్చి నగర వీధుల్లో సంచరిస్తున్నట్లు చండప్రచండంగా ఎండలు భగభగలాడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య కాసేపు ఆకాశంలో మబ్బులు కమ్ముకుని చినుకులు పడ్డాయి. ఉదయం 8 గంటల తర్వాత నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం మొదలు పెట్టాడు. మధ్యాహ్నం నాటికి 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే రోజున 36.5 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే గతేడాది కంటే ఈ ఏడాది ఒక్కసారిగా 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదు కావడమంటే మామూలు విషయం కాదని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే 40 నుంచి 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత తాకింది. దీంతో వీధులన్నీ నిర్యానుష్యంగా మారుతున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రాావడానికి జంకుతున్నారు.
కంభంలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు...
మార్కాపురం జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎప్పుడు చూసినా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కంభంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత నెల 27వ తేదీ కంభంలో 45.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత వందేళ్లలో కంభంలో ఎప్పుడూ ఇంతటి ఎండలు లేవని, ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని తెలిసింది. అదేరోజు ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలోని 22, మార్కాపురంలోని 15 మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.
ఉక్కరిబిక్కిరి!
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా డీఆర్‌ఓగా చంద్రశేఖర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కలెక్టర్లు, ఇతర అధికారుల బదిలీల్లో భాగంగా చీరాలలో పనిచేస్తున్న చంద్రశేఖర్‌ను ప్రకాశం జిల్లాకు డీఆర్వోగా బదిలీ చేశారు. ఇక్కడ డీఆర్‌ఓగా పనిచేస్తున్న బీసీహెచ్ ఓబులేసును కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్డీఓగా బదిలీ చేశారు. కర్నూలు జిల్లాలో ల్యాండ్ ఎక్విజిషన్‌లో పనిచేస్తున్న టి.అజయ్‌కుమార్‌ను కనిగిరి ఆర్‌డీఓగా నియమించారు. రామాయపట్నం ఇండస్ట్రియల్ హబ్‌లో పనిచేస్తున్న జీవీవీ సత్యనారాయణను కొత్తపేట ఆర్డీఓగా బదిలీ చేశారు. ఒంగోలు ఆర్డీఓ కే లక్ష్మీ ప్రసన్నను బదిలీ చేస్తూ.. ఆమె స్థానంలో చీరాల ఆర్డీఓగా పనిచేస్తున్న తూమాటి చంద్రశేఖర నాయుడును నియమించారు.


