ఘనంగా వైవీ జన్మదిన వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వైవీ జన్మదిన వేడుకలు

May 2 2026 12:01 PM | Updated on May 2 2026 12:01 PM

ఒంగోలు సిటీ: రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఒంగోలులోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు, నాయకులు పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. వైవీ సుబ్బారెడ్డి మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, వైఎస్సార్‌ సీపీ నాయకులు దామరాజు క్రాంతికుమార్‌, సన్నపురెడ్డి రమణమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని సుబ్బారెడ్డి నివాసంలో...

సింగరాయకొండ: హైదరాబాద్‌లోని వైవీ సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్సార్‌ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌, కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్‌, నాయకులు కుప్పం ప్రసాద్‌, కాకుమాను రాజశేఖర్‌, సింగరాయకొండ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, తదితర నాయకులంతా వైవీ సుబ్బారెడ్డిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైవీతో కేక్‌ కట్‌ చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement