నల్లమల ఘాట్‌లో మొరాయించిన లారీ | - | Sakshi
Sakshi News home page

నల్లమల ఘాట్‌లో మొరాయించిన లారీ

May 2 2026 11:43 AM | Updated on May 2 2026 11:43 AM

నల్లమల ఘాట్‌లో మొరాయించిన లారీ

గిద్దలూరు రూరల్‌: నల్లమల ఘాట్‌ రోడ్డులో గ్రానైట్‌ లారీ ప్రమాదానికి గురై మొరాయించడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఈ సంఘటన గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట గ్రామ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. కనిగిరి నుంచి తాడిపత్రికి గ్రానైట్‌ బ్లాకులు తరలిస్తున్న ట్రాలీ లారీ ప్రమాదవశాత్తు రోడ్డుపై నిలిచిపోవడంతో సుమారు 4 గంటల పాటు ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. నంద్యాల నుంచి గిద్దలూరుకు వచ్చే వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రోడ్డుపై ఆగిన లారీ

Advertisement
 
Advertisement
Advertisement