ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య

May 2 2026 11:43 AM | Updated on May 2 2026 11:43 AM

ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య

మార్కాపురం టౌన్‌: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మార్కాపురం పట్టణంలోని నాగులవరం రోడ్డులోగల నానాజాతుల కాలనీలో చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన షేక్‌ బాషా(43) తన ఇంటిలో ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి హుటాహుటిన మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన బాషాకు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానంతో మద్యం తాగినప్పుడు ఘర్షణ పడుతుండేవాడని, వేధింపులు భరించలేక పెద్ద కుమార్తెతో కలిసి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని మృతి చెందినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement