గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

Apr 30 2026 7:37 AM | Updated on Apr 30 2026 7:37 AM

గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 – 8లో.. తలకిందులైన పరిస్థితులు మరమ్మతులకు నోచని ఆక్సిజన్‌ ప్లాంట్‌

న్యూస్‌రీల్‌

ఒంగోలు, గుంటూరుకు రెఫరల్‌తో సరి

ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేది ఎక్కువగా పేదలే..ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుంది..తమ ప్రాణాలు నిలబడుతాయి అన్న ఆశగా వచ్చిన రోగులకు నిరాశే ఎదురవుతోంది. పశ్చిమ ప్రకాశానికి పెద్దదిక్కుగా ఉండే మార్కాపురం సర్వజన ఆస్పత్రిలో వైద్యసేవలు అందని ద్రాక్షగా మారిపోయాయి. నిపుణుల కొరత..పనిచేయని పరికరాలతో కునారిల్లుతోంది. అత్యవసర పరిస్థితుల్లో సేవలందించే ఐసీయూ కేంద్రం కోమాలోకి వెళ్లిపోయింది. ఏడాదిగా ఆక్సిజన్‌ ప్లాంట్‌లు మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. అత్యవసర వైద్యం కోసం ఇక్కడకు వచ్చేవారికి ప్రాథమిక వైద్యం అందించి పక్క జిల్లాలకు పంపుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వైద్యారోగ్య రంగం పడకేసిందన్న దానికి ఈ ఆస్పత్రి ఉదాహణగా నిలుస్తోంది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాడు జీజీహెచ్‌ రోగుల జీవితాలకు ధైర్యమిచ్చింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇక్కడ వైద్యసేవలు అంతంతమాత్రంగా అందుతున్నాయి. ఒక్కసారి జీజీహెచ్‌ వెళ్లి చూస్తే రోగులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గతంలో 75 మంది డాక్టర్లున్న జీజీహెచ్‌లో ప్రస్తుతం 18 మంది మాత్రమే ఉన్నారు. జీజీహెచ్‌లో పనిచేసే వైద్యులందరినీ ఒంగోలు, గుంటూరు, ఏలూరు, కర్నూలు ఇలా పలు ప్రాంతాలకు బదిలీ చేసింది. దీంతో డాక్టర్ల గదులు చాలా వరకూ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఓపీ కూడా 150 నుంచి 170కి పడిపోయింది. పలు అత్యాధునిక వైద్య పరికరాలు, ఇతర మెడికల్‌ కాలేజీలు, వైద్యశాలలకు పంపారు. దీనితో అత్యవసర వైద్యసేవలకు ఎవరైనా ఒంగోలు, గుంటూరులకు రెఫర్‌ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడున్న డాక్టర్లలో కూడా కొంత మంది త్వరలో బదిలీపై వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.

ఏడాది నుంచి ఆక్సిజన్‌ ప్లాంటు మరమ్మతులకు గురైంది. అప్పటి నుంచి ఈ ప్లాంటు నుంచి సేవలు నిలిచిపోయాయి. అత్యవసర సమయంలో రోగులకు ఆక్సిజన్‌ అందించాలంటే ఒక ప్లాంటుపైనే ఆధారపడాల్సి వస్తోందని ఆస్పత్రి వర్గాలు వాపోతున్నాయి.

మార్కాపురం:

కప్పుడు పశ్చిమ ప్రకాశంవాసులకు మెరుగైన వైద్యం గగనంగా ఉండేది. చిన్నపాటి రోగమొచ్చినా పొరుగు జిల్లాలకు పరుగులు తీయాల్సిందే. ఈ ప్రాంత వాసుల కష్టాలు గుర్తించిన వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్కాపురానికి మెడికల్‌ కళాశాలను మంజూరు చేశారు. రాయవరం వద్ద కళాశాల ఏర్పాటు కోసం రూ.450 కోట్లు కేటాయించారు. దాదాపు 75 శాతం నిర్మాణ పనులు పూర్తి చేశారు. దీనికి అనుబంధంగా మార్కాపురం వైద్యశాలను జీజీహెచ్‌గా మార్పు చేశారు. 450 బెడ్లను సిద్ధం చేశారు. ఇందులో జనరల్‌ సర్జరీ కోసం 100, జనరల్‌ మెడిసిన్‌ కోసం 100, ఆర్ధోపెడిక్‌ విభాగానికి 40, ఆప్తమాలజీ 20, డెర్మటాలజీ 10, సైక్రియాట్రిక్‌ విభాగానికి 10, ఈఎన్‌టీకి 20, ఐసీయూ 20, పీడియాట్రిక్స్‌ 50, గైనకాలజీకి 50 బెడ్లు కేటాయించారు. ఇలా మార్కాపురం జీజీహెచ్‌ రూపురేఖలు మార్చేశారు. సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకున్నారు. సుమారు 72 మంది వైద్యులను నియమించారు. రెండు ఆక్సిజన్‌ ప్లాంట్‌లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలతో పాటుగా శ్రీశైలం తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 8 లక్షల మంది ప్రజలు జీజీహెచ్‌కు వచ్చి అవసరమైన అత్యాధునిక వైద్య చికిత్సను ఉచితంగా చేయించుకునేవారు. వైద్య కష్టాలు తీరినట్టేనని ఈ ప్రాంతవాసులు సంబరపడ్డారు.

వైద్యులపై ఒత్తిడి..

తక్కువ మంది డాక్టర్లు ఉండడంతో జీజీహెచ్‌లో పనిచేస్తున్న వైద్యులపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. క్యాజువాలిటీ, ఐసీయూ, జనరల్‌ మెడిసిన్‌ చూడాల్సి రావడం, ఉన్న వైద్యుల్లో కొంతమంది నైట్‌డ్యూటీలకు వెళ్లాల్సిరావడంతో ఉదయం పూట ఉన్న డాక్టర్లపై భారం పడుతోంది. క్యాజువాలిటీ చూసే డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉంది. ఇటీవల ఒకే డాక్టరుకు వరుసగా డ్యూటీలు వేయడంతో తీవ్రమైన ఒత్తిడితో సెలవుపై వెళ్లినట్టు తెలిసింది.

కోమాలో ఐసీయూ

జీజీహెచ్‌లోని ఐసీయూ కేంద్రం కోమాలోకి వెళ్లింది. ఈ విభాగంలో 4 డాక్టర్లు ఉండాలి. ఇందులో ఎండీతో పాటు పలువురు వైద్యనిపుణులు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం డాక్టర్ల కొరత తీవ్రంగా ఉండటంతో ఇక్కడ వైద్యసేవలు అంతంత మాత్రంగా మారిపోయాయి. ప్రస్తుతం క్యాజువాలిటీలో ఒకరు, జనరల్‌ సర్జన్లు ముగ్గురు, గైనకాలజీ, ఆర్థోపెడిక్‌, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, పీడియాట్రిక్‌ విభాగాల్లో మాత్రమే సేవలు అందుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement