కదలని బండి..
డీజిల్ కష్టాలు జిల్లా ప్రజలను వెంటాడుతున్నాయి. ఇప్పటికీ కొన్ని పెట్రోలు బంకుల్లో నోస్టాక్ బోర్డులు పెట్టి మూసేశారు. డీజిల్ కొరతతో గ్రానైట్ పరిశ్రమ స్తంభించిపోయింది. క్వారీయింగ్‌కు ఉపయోగించే భారీ యంత్రాలు, పొక్లెయిన్‌లు, టిప్పర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో క్వారీల్లో పనులు ఆగిపోయాయి. కంకర క్రషర్ యూనిట్లూ మూతపడ్డాయి. ఇక ఒంగోలు నగరంలో డీజిల్ కొరతతో మంచినీటి సరఫరా ట్యాంకర్లు నిలిచిపోయాయి. దూర ప్రాంతాలకు సరుకులు రవాణా చేసే లారీలు ఆయిల్ లేక ఒంగోలు లారీ యూనియన్ ఆఫీసు వద్దే ఆగిపోయాయి.
– సాక్షి, ఒంగోలు


