అధికార పార్టీకి జీహుజూర్‌.. | - | Sakshi
Sakshi News home page

అధికార పార్టీకి జీహుజూర్‌..

Apr 30 2026 7:37 AM | Updated on Apr 30 2026 7:37 AM

భగీరథ కెమికల్స్‌కు 500 లీటర్ల డీజిల్‌కు అనుమతి దాదాపు 3 వేల లీటర్లు పట్టే 15 డ్రమ్ములతో వచ్చిన వాహనం బీపీసీఎల్‌ నిర్వాహకులను నిలదీసిన స్థానికులు అంతపెద్ద మొత్తంలో డీజిల్‌ ఎలా ఇస్తారని ఆగ్రహం

టంగుటూరు: డీజిల్‌, పెట్రోల్‌ దొరక్క సామాన్యులు అవస్థలు పడుతుంటే అధికార పార్టీ నాయకులకు, అధికార పార్టీకి చెందిన అనుకూల వ్యక్తులకు కావాల్సినంత లభ్యమవుతోంది. ప్రభుత్వం విధించిన నిబంధనలు వీరికి పట్టవు అన్నరీతిలో అధికార యంత్రాంగం వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలను నిజం చేస్తోంది బుధవారం సూరారెడ్డిపాలెం సమీపంలోని బీపీసీఎస్‌ పెట్రోల్‌ బంకు వద్ద జరిగిన సంఘటన. ఒంగోలు మండలం సమీపంలోని భగీరథ కెమికల్స్‌కు 500 లీటర్ల డ్రమ్ములకు ఆర్డీఓ అనుమతినిచ్చారు. అయితే డీజిల్‌ కొట్టించుకునేందుకు 150 నుంచి 200 లీటర్లు పట్టే 15 డ్రమ్ములతో ఆ కంపెనీకి చెందిన ట్రాక్టర్‌ వచ్చింది. అయితే అక్కడే ఉన్న కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఇన్ని డ్రమ్ములకు డీజిల్‌ ఎలా కొడుతున్నారంటూ బంకు నిర్వాహకులను నిలదీశారు. అయితే ఆర్డీఓ అనుమతినిచ్చారని, అందుకే డీజిల్‌ కొడుతున్నామని నిర్వాహకులు చెప్పుకొచ్చారు. 500 లీటర్లకే అనుమతినిస్తే ఇన్ని డ్రమ్ములు వాహనంలో ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 30 వేల లీటర్లకు పైగా కొట్టి ఉంటారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన వారికి ఇలా నిబంధనలకు విరుద్ధంగా డీజిల్‌ ఎలా కొడతారని స్థానికులు నిలదీస్తున్నారు. పెట్రోల్‌ బంకుల యజమానులు అధికార పార్టీకి చెందిన వారితో కుమ్మకై ్క సామాన్య ప్రజలకు ఒక విధంగా, వారికి మరో విధంగా డీజిల్‌ పోస్తు్‌ాన్నరని ఆరోపిస్తున్నారు. ఇంతకూ ఎన్ని లీటర్ల డీజిల్‌ కొట్టారో నిగ్గు తేల్చాలని అధికారపార్టీకి చెందిన ఒక నాయకుడు డిమాండ్‌ చేయడం కొసమెరుపు. ఈ విషయంపై తహశీల్దారును వివరణ కోరగా 500 లీటర్ల డీజిల్‌ అనుమతి మేరకు మాత్రమే కొట్టారని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement