గ్రావెల్ మాఫియా అరాచకాలను అధికారులు చూసీ చూడనట్టు వదిలేయడం వెనుక తీవ్ర స్థాయిలో రాజకీయ ఒత్తిడి ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒప్పందం మేరకు గ్రావెల్ మాఫియా సిండికేట్ మార్కాపురం టీడీపీ ముఖ్యనేతకు టిప్పర్‌కు రూ.1000, ట్రాక్టర్‌కు రూ.300 చొప్పున కప్పం కడుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. నాలుగు నెలల క్రితం మార్కాపురం జిల్లాను ప్రకటించిన తర్వాత వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఆయా వెంచర్లకు హంగులు దిద్దేందుకు అవసరమైన మట్టిని మార్కాపురం చుట్టుపక్కల గ్రామాల్లోని కొండ ప్రాంతాలు, చెరువుల నుంచే భారీగా తరలిస్తున్నారు. కప్పం కట్టని టిప్పర్లు, ట్రాక్టర్లను సీజ్ చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మాఫియా నియంత్రణతో మట్టి ధరలు అమాంతం పెరిగాయి. దూరాన్ని బట్టి ఒక టిప్పర్ మట్టికి రూ.5000కు పైగా, ట్రాక్టర్‌కు రూ.1300కు పైగా వసూలు చేస్తున్నారు. సాఽమాన్య ప్రజలు చిన్నచిన్న అవసరాలుకు కూడా మట్టి తోలుకోలేని పరిస్థితి ఏర్పడింది.


