● వైఎస్సార్ టీఏ పిలుపు
ఒంగోలు సిటీ: ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపై వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ మే 6వ తేదీ విజయవాడ ధర్నా చౌక్ లో తలపెట్టిన మహా ధర్నాకు ఉపాధ్యాయ సంఘా లు సహకరించాలని వైఎస్సార్ టీచర్స్ అసో సియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి కోరారు. ఈ సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర బాధ్యులు, ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ ప్రభాకర్‌రెడ్డిని కలసి మహాధర్నాలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్‌సీ కమిటీ ఏర్పాటు, 30 శాతం ఐఆర్ ప్రకటన, 4 డీఏ మంజూరు, పెండింగ్ బకాయిలు చెల్లింపు, ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలు హెల్త్ కార్డు మంజూరు,మరణించిన ఉపాధ్యా యుల పిల్లలకు కారుణ్య నియామకాలు సమస్యలపై స్పందించే ప్రతి సంఘ కార్యక్రమాలకు మా మద్దతు ఉంటుందని తెలిపారు. మే 6 వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ చేపట్టే మహా ధర్నాలో పాల్గొంటారని తెలిపారు. ఉపాధ్యాయులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.


