డీజిల్‌ సంక్షోభానికి బాబే కారణం | - | Sakshi
Sakshi News home page

డీజిల్‌ సంక్షోభానికి బాబే కారణం

Apr 29 2026 8:18 AM | Updated on Apr 29 2026 8:18 AM

డీజిల్‌ సంక్షోభానికి బాబే కారణం

కనిగిరి రూరల్‌: రాష్ట్రంలో ఇంధన కొరతకు చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ పాలనే కారణమని వైఎస్సార్‌ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ దద్దాల నారాయణ యాదవ్‌ ధ్వజమెత్తారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద పెట్రోల్‌ బంక్‌ను మంగళవారం పార్టీ నేతలతో కలిసి ఆయన ప్రత్యక్ష పరిశీలన చేసి విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఉందన్నారు. ఈ సంక్షోభం ఏర్పడేందుకు కారణం సీఎం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమేనని తీవ్రంగా ఎండగట్టారు. సర్కార్‌కు కనీస ముందుచూపు లేక పోవడంతోనే ఇలాంటి దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రజలకు క్యూ లైన్‌ కష్టాలు నెలకొన్నాయన్నారు. విత్తనాలు, ఎరువులు, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ఇలా అన్నింటికి రోడ్లపై బారులు తీరాల్సిన దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బినామీలకు కట్టబెట్టేందుకే..

ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు సర్కార్‌ విఫలం చెందిందని, ప్రచార ఆర్భాటం తప్పా.. ఆచరణ అమలు కరువైందని ఎద్దేవా చేశారు. సంపద సృష్టి పేరుతో చంద్రబాబు తన అనుయాయులు, బినామీలకు లబ్ధి చేసేలా పాలన చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సర్కార్‌ దుర్మార్గపు పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో తప్పక బుద్ధి చెప్తారని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో కరోనా కష్టకాలంలో కూడా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిదేనన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పీడీసీసీబీ మాజీ చైర్మన్‌ వైఎం ప్రసాద్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎస్‌కే అబ్దుల్‌ గఫార్‌, జెడ్పీటీసీ, పార్టీ మండల అధ్యక్షుడు మడతల కస్తూరిరెడ్డి, గంగసాని హుస్సేన్‌రెడ్డి, ఎంపీపీ గాయం సావిత్రి, మాజీ ఎంపీపీ గాయం బలరాంరెడ్డి, సూరసాని మోహన్‌రెడ్డి, ఆవుల భాస్కర్‌రెడ్డి, తమ్మినేని సుజాతరెడ్డి, ఆయిమల్ల నాగమణి, గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, కటికల వెంకటరత్నం, మూలే గోపాల్‌రెడ్డి, ఒకే రెడ్డి, యక్కంటి శ్రీను, జి.బొర్రారెడ్డి, ఆర్‌.మాణిక్యరావు, దాదిరెడ్డి మాలకొండారెడ్డి, రామనబోయిన శ్రీను, డాక్టర్‌ రసూల్‌, డాక్టర్‌ కృష్ణారెడ్డి, జి.అబ్రహం లింకన్‌, వై.దేవరాజ్‌, పిల్లి లక్ష్మీనారాయణరెడ్డి, సానికొమ్ము మధుసూదన్‌రెడ్డి, చింతం శ్రీనివాసుల యాదవ్‌, మూలే రాజశేఖరరెడ్డి, కంటు గురవయ్య, ఎస్‌కే ఫయాజ్‌, పోలిచర్ల రహీంబాషా, ఎస్‌కే ఖాశింవలి, ఎస్‌కే కరీముల్లా, ఎస్‌కే నాగూర్‌ వలి, కోఆప్షన్‌ నాయబ్‌ రసూల్‌, ఎస్‌కే సన్నీ, గట్లా విజయభాస్కర్‌రెడ్డి, దరిశి సుబ్రహ్మణ్యం, దరిశి ఫణికుమార్‌, పైడిమర్రి ఫణి, పలుకూరి భాస్కర్‌, రుద్రపాటి సాల్మన్‌, దమ్మువెంకటయ్య, సుస్మిత, దద్దాల రాములు, పెరికల వెంకటేశ్వర్లు, వంకదారి రాజ, రమేష్‌, ముత్యాల ప్రతాప్‌, కె.రవి, ఎం.బాలకృష్ణ, అచ్చయ్య, పి.చెన్నకేశవులు, సంగు కృష్ణారెడ్డి, మడతల నాగిరెడ్డి, మిట్టా రమేష్‌రెడ్డి, బత్తుల మాలీ యాదవ్‌, డి.రవి యాదవ్‌, డి.మాల్యాద్రి యాదవ్‌ పాల్గొన్నారు.

సంపద సృష్టి పేరుతో రాష్టం సర్వనాశనం

ఎన్నికల హామీలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు

వైఎస్సార్‌ సీపీ కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణ ధ్వజం

Advertisement
 
Advertisement
Advertisement