నేడు వైఎస్సార్‌, సంజీవరెడ్డిల విగ్రహావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌, సంజీవరెడ్డిల విగ్రహావిష్కరణ

Apr 29 2026 8:18 AM | Updated on Apr 29 2026 8:18 AM

ఒంగోలు వన్‌టౌన్‌: ఒంగోలులోని మామిడిపాలెం సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ దగ్గర ఉన్న రెడ్డి హాస్టల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి డా.నీలం సంజీవరెడ్డి, దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాల ఆవిష్కరణను బుధవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు రెడ్డి హాస్టల్‌ కమిటీ అధ్యక్షుడు, రెడ్డి జనాభ్యుదయ సంఘ అధ్యక్షుడు వై రమణారెడ్డి తెలిపారు. విగ్రహాలను రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, హాస్టల్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ కన్వీనర్‌ బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని వాకా సంజీవరెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని సిరిపురపు విజయభాస్కర్‌ రెడ్డిలు సహకారం అందించినట్లు తెలిపారు. అదేవిధంగా హాస్టల్‌లో ఏర్పాటు చేసిన సోలార్‌ విద్యుత్‌, కాన్ఫరెన్స్‌ హాలు, హాస్టల్‌ గదులకు అటాచ్డ్‌ బాత్‌రూంలు, వంట గది ఆధునికీకరణ, డిజిటల్‌ లైబ్రరీ, మినరల్‌ ప్లాంట్‌లను కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్యదర్శి అన్నపురెడ్డి చిన ఆదిరెడ్డి, ట్రెజరర్‌ భవనం నాగిరెడ్డి, ఉపాధ్యక్షుడు నరహరి రామలింగారెడ్డి, మెంబర్‌ పాలవెల్లి వెంకటేశ్వర రెడ్డి, ఈసీ మెంబర్‌ గోపవరపు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement