● మరొకరికి తీవ్రగాయాలు
కంభం: ద్విచక్ర వాహనాన్ని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన అనంతపురం– అమరావతి హైవే రోడ్డుపై సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలో జంగంగుంట్ల గ్రామం వద్ద ఓ ట్రావెల్స్ బస్సు ఆగి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న సమయంలో పోరుమామిళ్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న బస్సును దాటుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి వాహనంపైకి ఎక్కింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న మల్లెల శ్రీనివాసరెడ్డి (45) అక్కడికక్కడే మృతి చెందగా, అలీ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు.


