● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
పొన్నలూరు:
తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పొన్నలూరు ఎస్సై సత్యనారాయణ సోమవారం నిందితుడి వివరాలను వెల్లడించారు. కనిగిరి మండలం బోయపాలెం గ్రామానికి చెందిన కామినేని మనోహర్ మద్యానికి బానిసై చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తన ఆటోలో గ్రామాల్లో తిరుగుతూ ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి ఇళ్లల్లో చొరబడి వస్తువులను దొంగలించి విక్రయించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 24న పరుచూరివారిపాలెం గ్రామంలోని జగనన్న కాలనీలో పట్ట పగలు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి వస్తువులను దొంగలించాడు. దీంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నిఘా ఉంచిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని దగ్గర నుంచి రూ.30 వేల విలువైన మైక్‌సెట్, పిండి మిషన్, కారు బ్యాటరీలు, హోమ్ థియటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితుడిని ఆదివారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.


