నేడు వైఎస్సార్‌ సీపీ పంచాయతీరాజ్‌ విభాగం ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌ సీపీ పంచాయతీరాజ్‌ విభాగం ర్యాలీ

Apr 27 2026 8:18 AM | Updated on Apr 27 2026 8:18 AM

నేడు వైఎస్సార్‌ సీపీ పంచాయతీరాజ్‌ విభాగం ర్యాలీ 28న వైపాలెంలో సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఎంపిక 11 గంటల వరకే పోలీసు స్పందన ● ఎస్పీ హర్షవర్థన్‌ రాజు పెట్రోల్‌, డీజిల్‌ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు ● కలెక్టర్‌ విజయసునీత

ఒంగోలు సిటీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు నన్నెబోయిన రవికుమార్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధిహామీ పథకంలో కూటమి ప్రభుత్వ అవినీతి, పెండింగ్‌ వేతనాలపై సోమవారం ఉదయం 11 గంటలకు ఒంగోలులోని అంబేడ్కర్‌ భవన్‌ నుంచి కలెక్టర్‌ ఆఫీస్‌ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తారన్నారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

యర్రగొండపాలెం: ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి సీనియర్‌ అథ్లెటిక్స్‌ల ఎంపిక స్థానిక మాచర్ల రోడ్డులోని గురుకుల పాఠశాలలో ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్‌ అసోషియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్రరావు, వెంకట్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఈ పోటీల్లో 20 ఏళ్లు దాటిన యువతీ, యువకులు పాల్గొనవచ్చన్నారు. ఎంపికై న క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో జరిగే అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక చేస్తామని, ఆసక్తి ఉన్న క్రీడాకారులు బర్త్‌ సర్టిఫికెట్‌, 10వ తరగతి మార్క్‌లిస్ట్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌లతోపాటు రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో మంగళవారం ఉదయం 8గంటలలోపు హాజరుకావాలని వారు కోరారు. వివరాలకు సెల్‌: 76750 26220 నంబర్‌కు సంప్రదించవచ్చని తెలిపారు.

ఒంగోలు టౌన్‌: అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎస్పీ హర్షవర్థన్‌ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతోపాటుగా నగరవాసులు 11 గంటలలోపే దరఖాస్తులు అందజేయాలని, మార్చిన సమయాన్ని ఫిర్యాదుదారులు గమనించాలని కోరారు.

మార్కాపురం టౌన్‌: జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కొరత లేదని ఏజెన్సీలు సరఫరాదారులు కృత్రిమ సృష్టిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఎం విజయసునీత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవసరపడే పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు ఉన్నాయని, వీటి కొరతపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. అపోహలు నమ్మి వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు భయాందోళనకు గురై అవసరమైన దానికంటే ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. పెట్రోల్‌ బంకులపై బల్క్‌ కొనుగోలు అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలోని ఇంధన రిటైల్‌ ఔట్‌లెట్‌ తనిఖీలు నిర్వహించి ఎవరి వద్దైనా అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెట్‌ అమ్మకాలు సృష్టిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement