● ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట రామయ్య
మార్కాపురం టౌన్: ఉద్యోగుల నిరవధిక సమ్మె సందర్భంగా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ వెంకట రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల ఒప్పందాల అమలు కోసం భవిష్యత్తు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా నూతన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా డీకేఎం రఫీ, జిల్లా అధ్యక్షుడిగా పీఎల్ రంగయ్య, ప్రధాన కార్యదర్శిగా సుధాకర్‌రెడ్డి, కోశాధికారిగా ఎర్రారెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరెడ్డి, రమణయ్య, సహాయ కార్యదర్శిగా మల్లికార్జునరెడ్డి, కన్వీనరుగా శ్రీకాంత్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు ఏ సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు హనుమంతారావు, మనోజ్, రామాంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


