గిద్దలూరులో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న హైకోర్టు జడ్జి
కనిగిరి రూరల్/గిద్దలూరు రూరల్: మార్కాపురం జిల్లా కనిగిరిలో కొటో అదనపు సివిల్ జడ్జి కోర్టు(జూనియర్ డివిజన్), గిద్దలూరులో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ డాక్టర్ లక్ష్మణ్ రావు, ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి, అదనపు జిల్లా జడ్జి టి.రాజా వెంకటాద్రి మాట్లాడారు.
కక్షిదారులకు సత్వర న్యాయసేవలు అందించేందుకు అదనపు కోర్టులను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా కనిగిరి, గిద్దలూరులో అదనపు కోర్టులను ప్రారభించినట్లు తెలిపారు. ఉచిత న్యాయ సేవలను అందించేందుకు న్యాయస్థానాలు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి బి.రూపశ్రీ, గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.ఓంకార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.భరత్ చంద్ర, గిద్దలూరు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సి.రమేష్‌యాదవ్, జిల్లాలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులు, కలెక్టర్ ఎం.విజయ సునీత, జిల్లా ఇన్‌చార్జి వి.హర్షవర్థన్ రాజు, ఆర్డీఓ శివరామిరెడ్డి, డీఎస్పీ, కమిషనర్ పి.శ్రీధర్, కనిగిరి బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అచ్చాల ఆదినరసారెడ్డి, ఎస్‌డీ షాహిద్ మహమ్మద్, ఏజీపీ పాశం పిచ్చయ్య యాదవ్, గిద్దలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.శేషశయనారెడ్డి, స్థానిక నాయవాదులు, వివిధ శాఖల ప్రభుత్వ ఆధికారులు పాల్గొన్నారు.
కనిగిరిలో ఒకటో అదనపు, గిద్దలూరులో రెండో అదనపు సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటు
ముఖ్య అతిథులుగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, డాక్టర్ లక్ష్మణ్ రావు


