క్రికెట్‌ జట్ల ఎంపికకు విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ జట్ల ఎంపికకు విశేష స్పందన

Apr 27 2026 8:18 AM | Updated on Apr 27 2026 8:18 AM

ఒంగోలు టౌన్‌: ఉమ్మడి ప్రకాశం జిల్లా పురుషుల అండర్‌ 16, మహిళల అండర్‌ 15 క్రికెట్‌ జట్ల ఎంపిక ఆదివారం మంగమూరు రోడ్డులోని ఏసీఏ క్రికెట్‌ సబ్‌ సెంటర్‌ మైదానంలో నిర్వహించారు. ప్రకాశం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఎంపికకు విశేష స్పందన వచ్చినట్లు క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ కారుసాల నాగేశ్వరరావు తెలిపారు. పురుషుల అండర్‌ 16 క్రికెట్‌ సెలక్షన్లకు జిల్లా నలుమూలల నుంచి 90 మంది క్రీడాకారులు హాజరు కాగా ప్రతిభ చాటిన 32 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. మేలో రావినూతలలో జరిగే సెలక్షన్లలో ప్రతిభ కనబరిచిన 16 మందిని జిల్లా నుంచి తుది జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. మహిళల అండర్‌ 15 ఎంపికలకు జిల్లా నుంచి 22 మంది క్రీడాకారులు హాజరయ్యారని, వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 16 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. అండర్‌ 16 పురుషుల విభాగం జట్టు జూన్‌లో గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలతో జరిగే మ్యాచ్‌లలో తలపడుతుందన్నారు. మహిళల అండర్‌ 15 జట్టు మంగళగిరి స్టేడియం, కృష్ణ, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా జట్లతో తలపడుతుందని తెలిపారు. తొలుత జీజీహెచ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నామినేని కిరణ్‌కుమార్‌ క్రీడాకారుల పరిచయం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement