ఒంగోలు టౌన్:
నేర నియంత్రణ చర్యల్లో భాగంగా నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే ఆర్టీసీ, రైల్వే స్టేషన్లలో పోలీసులు శనివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్, పేలుడు పదార్థాలను పసిగట్టే జాగిలం చీత, బాంబు స్క్వాడ్, పోలీసు బృందాలు తనిఖీల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండు సెంటర్లోని కార్గో పార్శిల్ సర్వీస్, రైల్వే స్టేషన్లోని పార్శిల్ కార్యాలయాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులు, అపరిచిత లగేజీలను గుర్తించేందుకు బస్టాండు ఆవరణతో పాటు పరిసరాలను తనిఖీ చేశారు. అనుమానం ఉన్న ప్రయాణికుల బ్యాగులు తెరిపించి పరిశీలించారు. అనుమానాస్పద పార్శిళ్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసు అధికారులు కోరారు. తనిఖీల్లో ఒంగోలు వన్‌టౌన్, టూటౌన్ పోలీసులు పాల్గొన్నారు.


