గాయపడిన జింకకు సంరక్షణ | - | Sakshi
Sakshi News home page

గాయపడిన జింకకు సంరక్షణ

Apr 26 2026 5:03 AM | Updated on Apr 26 2026 5:03 AM

గాయపడిన జింకకు సంరక్షణ

అటవీశాఖ అఽధికారులకు అప్పగింత

బల్లికురవ: చిల్లచెట్లలో చిక్కుకుని గాయపడిన జింకకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో సంరక్షించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఘటన శనివారం బల్లికురవ నుంచి సంతమాగులూరు వెళ్లే రోడ్డులో మల్లయపాలెం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ముళ్ల పొదల్లో జింక ఇరుక్కుని కదిలే పరిస్థితి లేని విషయం ఎస్సై నాగరాజు దృష్టికి రావడంతో సిబ్బందితో బయటకు తీయించి సంరక్షించారు. అనంతరం కూకట్లపల్లి ఫారెస్ట్‌ బీట్‌ అధికారి కే రమేశ్‌కు జింకను అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement