న్యూస్‌రీల్
డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్‌ల ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటంతో మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాల వారీగా ఇప్పటికే సంబంధిత అధికారులు స్మార్ట్ కిచెన్‌లు నిర్మించేందుకు అనువైన స్థలాల కోసం గాలింపు మొదలు పెట్టారు. మండల కేంద్రాల్లో స్మార్ట్ కిచెన్‌లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని వాహనాల ద్వారా తరలిస్తే జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 4500 మంది మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి ఏంటని వారు ఆందోళన చెందుతున్నారు.
నాణ్యమైన భోజనం వండుతున్నాం
పాఠశాలల్లో పిల్లలకు అప్పటికప్పుడు వేడివేడిగా అన్నం తయారు చేసి పెడుతున్నాం. ఎక్కడో వండిన అన్నం అన్ని పాఠశాలలకు వాహనాల్లో తీసుకొచ్చి వడ్డించే సరికి అది చల్లబడటంతో పాటు రుచి మారిపోతుంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కొనసాగించాలి.
– జి.కెత్తుర, మధ్యాహ్న భోజన కార్మిక సంఘ కంభం మండల కార్యదర్శి


