ముగ్గురు సీఐల నియామకం | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు సీఐల నియామకం

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

ఒంగోలు టౌన్‌: జిల్లా పోలీసు శాఖలో బదిలీ పర్వం కొనసాగుతోంది. ఇటీవల ఇద్దరు సీఐలను వీఆర్‌కు పంపించి ముగ్గురు సీఐలకు పోస్టింగులు ఇవ్వడం తెలిసిందే. శనివారం మరో మూడు సర్కిళ్లకు సీఐలను నియమించారు. సింగరాయకొండ సీఐగా శ్రీహరిని నియమించారు. ఆయన ప్రస్తుతం గుంటూరు ఎస్‌బీలో విధులు నిర్వహిస్తున్నారు. కావలికి చెందిన ఆయన కొత్తపట్నం ట్రైనీ ఎస్సైగా పోలీసు శాఖలో ప్రవేశించి ఆ తరువాత జిల్లాలో ఒంగోలు, చీరాల, పొదిలి, మర్రిపూడి, కంభం ఎస్సైగా చేశారు. ఇక్కడ సీఐగా పనిచేస్తున్న హజరత్తయ్యను ఒంగోలు ట్రాఫిక్‌ సీఐగా బదిలీ చేయడం తెలిసిందే. కొండపి సీఐగా వైవీ రమణయ్యను నియమించారు. ప్రస్తుతం ఆయన ఇంకొల్లు సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో సింగరాయకొండ, నాగులుప్పలపాడు, మార్కాపురం ప్రాంతంలో పలు స్టేషన్లలో పనిచేసిన అనుభవం ఉంది. మార్కాపురం సీఐగా అల్తాఫ్‌ హుస్సేన్‌కు పోస్టింగు ఇచ్చారు. గతంలో ఆయన జిల్లాలోని పెద్దదోర్నాల, అర్ధవీడు, రాచర్ల, పొదిలి, నాగులుప్పలపాడు, ఒంగోలు తాలుకాలో ఎస్సైగా పనిచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement