మాజీ సైనికులకు న్యాయ సహాయం | - | Sakshi
Sakshi News home page

మాజీ సైనికులకు న్యాయ సహాయం

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్‌ ఇబ్రహీం షరీఫ్‌

ఒంగోలు టౌన్‌: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వీర్‌ పరిహార్‌ సహాయ యోజనలో భాగంగా మాజీ సైనికులకు న్యాయ సహాయం అందించేందుకు లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి షేక్‌ ఇబ్రహీం షరీఫ్‌ తెలిపారు. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. ఉన్నత న్యాయస్థానం కల్పించిన ఈ అవకాశాన్ని మాజీ సైనికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాది ఎన్‌.ధనలక్ష్మి, న్యాయ సహాయకులు పి.శ్రీనివాసరావు, సైనిక కార్యలయం పర్యవేక్షణాధికారి పద్మజ, సిబ్బంది సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement