26న బీచ్‌ కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

26న బీచ్‌ కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక

Apr 24 2026 7:32 AM | Updated on Apr 24 2026 7:32 AM

26న బీచ్‌ కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక పరిశ్రమలకు రాయితీలు 26న అండర్‌ – 15, 16 క్రికెట్‌ జిల్లా జట్ల ఎంపిక

ఒంగోలు: సీ్త్ర, పురుషుల బీచ్‌ కబడ్డీ జిల్లా జట్లను ఈ నెల 26వ తేదీ ఎంపిక చేయనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కుర్రా భాస్కరరావు, వై.పూర్ణచంద్రరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సింగరాయకొండ మండలం పాకల బీచ్‌ వద్ద సాయంత్రం 3 గంటలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. పురుషులు 85 కేజీల్లోపు, సీ్త్రలు 75 కేజీల్లోపు బరువు కలిగి ఉండాలన్నారు. ఎంపికై న జిల్లా జట్లు మే 7 నుంచి 10వ తేదీ వరకు నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో నిర్వహించే 13వ రాష్ట్రస్థాయి బీచ్‌ కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు పీడీ కిరణ్‌కుమార్‌ (8327667733)ను సంప్రదించాలని భాస్కరరావు, పూర్ణచంద్రరావు సూచించారు.

కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు సిటీ: జిల్లాలో పరిశ్రమలకు సంబంధించి 241 క్లెయిమ్‌లకుగానూ రూ.32.64 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ పి.రాజాబాబు తెలిపారు. గురువారం కలెక్టర్‌ అధ్యక్షతన డీఐఈపీసీ సమావేశం జరిగింది. స్థానిక ప్రకాశం భవనంలో నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మెగా ప్రాజెక్టులైన ఇండోసోల్‌, బీపీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ, బీడీఎల్‌ పరిశ్రమల పురోగతి, ఎంవోయూ చేసుకున్న పరిశ్రమల పురోగతి గురించి చర్చించారు. త్వరలో మెగా పరిశ్రమలకు అనుసంధానంగా ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేసేలా ఎంఎస్‌ఎంఈ కాన్‌క్లేవ్‌ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. వన్‌ ఫ్యామిలీ వన్‌ ఇంటర్‌ప్రెన్యూర్‌ ద్వారా ప్రతి కుటుంబంలో ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగడానికి కార్యాచరణ రూపొందించాలని డీఆర్‌డీఏ పీడీ, మెప్మా పీడీ, ఏపీఎంఐపీ పీడీ, డీపీఓలను ఆదేశించారు.

ఒంగోలు: స్థానిక మంగమూరు డొంకలోని జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సబ్‌ సెంటర్లలో అండర్‌ – 15 బాలికలు, అండర్‌ – 16 బాలుర జిల్లా క్రికెట్‌ జట్లను ఈ నెల 26వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్‌ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వారు మాత్రమే అర్హులని చెప్పారు. అండర్‌ – 16 విభాగంలో ఎంపికకు వచ్చే క్రీడాకారులు 2010 సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి 2012 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని సూచించారు. అండర్‌ – 15 విభాగానికి హాజరయ్యే బాలికలు 2011 సెప్టెంబర్‌ 1వ తేదీ తర్వాత జన్మించి ఉండాలన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం (ఫారం 5), ఆధార్‌కార్డు, స్టడీ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. బాలురు సొంత కిట్‌, వైట్‌ డ్రస్‌, షూతో హాజరుకావాలన్నారు. బాలికలు మాత్రం కలర్‌ డ్రస్‌, షూ, సొంత కిట్‌తో హాజరుకావాలని చెప్పారు. పూర్తి వివరాలకు కోచ్‌ పి.శ్రీనివాస్‌ (9573424360)ను సంప్రదించాలని నాగేశ్వరరావు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement