● కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు వన్‌టౌన్: పట్టుదల దీక్షకు మారుపేరు భగీరఽథ మహర్షి అని కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు. భగీరఽథ మహర్షి జయంతిని పురస్కరించుకొని స్థానిక కేశవస్వామిపేటలోని ఆయన విగ్రహానికి కలెక్టర్, జిల్లా అధికారులు, పలు సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మానవుడు పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏం ఉండదని నిరూపించిన మహనీయులు మహర్షి భగీరథుడని, ఆయన పట్టుదలను త్యాగాన్ని, స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మల జ్యోతి, ప్రకాశం జిల్లా సాగర /ఉప్పర సంఘం అధ్యక్షుడు జె.శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి జె.మురళీకృష్ణ, ఒంగోలు నగర అధ్యక్షుడు రెడ్డి పరమేశ్వరావు, కార్యదర్శి కర్ణాటి వేణు, పలువురు నాయకులు పాపు శ్రీను, తుము రాజేష్, పాలూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: యూరియా పక్కదారి పట్టకుండా పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. ప్రకాశం భవనంలో జిల్లాస్థాయి ఎరువుల సరఫరా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లాలో యూరియా లభ్యత, వినియోగం తీరును జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు వివరించారు. జిల్లాలో పెరల్ డిస్టలరీస్, భగీరథ కెమికల్స్ పరిశ్రమలు ఉన్నా వాటి ఉత్పత్తుల ప్రక్రియలో సబ్సిడీ యూరియాను వినియోగించడం లేదని తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ కేవలం వ్యవసాయ అవసరాలకే యూరియా వినియోగించేలా చూడాలన్నారు. ఈ దిశగా ఎరువుల దుకాణాలపై నిఘా పెట్టాలని, రోజువారీ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ నిల్వలు లేకుండా యూరియా విక్రయాల వివరాలను ఎప్పటికప్పుడు దుకాణదారులు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు చేసేలా పర్యవేక్షించాలని చెప్పారు. పోలీసులు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ, అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జిల్లా సరిహద్దుల నుంచి అక్రమ రవాణా జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీ దేవి, డీఎస్‌ఓ పద్మశ్రీ, రెవిన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
గుడ్లూరు: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన 16వ నంబర్ జాతీయ రహదారిపై తెట్టు శాంతీనగర్ మధ్య గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..ెనెల్లూరు జిల్లా జలదంకి మండలం జలదంకి గ్రామానికి చెందిన పులివర్తి సుధాకర్ (60) గుడ్లూరు మండలం చెమిడదపాడులో పొలం పనులు చేసుకొని తిరిగి వస్తుండగా శాంతీనగర్ సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.


