అందుకే.. మండేది! | - | Sakshi
Sakshi News home page

అందుకే.. మండేది!

Apr 23 2026 8:12 AM | Updated on Apr 23 2026 8:12 AM

ఏమరపాటు, అజాగ్రత్త, నిర్లక్ష్యంతోనే అగ్నిప్రమాదాలు

జిల్లా మార్కాపురం

మండలాలు 21

మొత్తం ఫైర్‌ స్టేషన్లు 6

ఫైర్‌మెన్‌ ఖాళీలు 33

ఆరేళ్లలో సంభవించిన

అగ్ని ప్రమాదాలు 1654

ఆస్తి నష్టం రూ.18.64 కోట్లు

గత ఆరేళ్లలో మార్కాపురం జిల్లాలో

అగ్ని ప్రమాదాలు ఇలా..

మార్కాపురం:

మీ కాదులే అనే ధైర్యం.. ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం తరచూ అగ్ని ప్రమాదాలకు దారి తీస్తోంది. సాధారణ సమయాలతో పోలిస్తే వేసవిలో మార్చి నుంచి జూన్‌ వరకు అగ్ని ప్రమాదాల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. మార్కాపురం జిల్లాలోని యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో 2020 నుంచి ఇప్పటి వరకు 1654 అగ్ని ప్రమాదాలు సంభవించగా సుమారు 18.64 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది సంఘటన స్థలాలకు చేరుకుని మంటలను అదుపు చేయడం వల్ల సుమారు 36.45 కోట్ల రూపాయల ఆస్తులను కాపాడగలిగారు.

మానవ తప్పిదాతో భారీ మూల్యం!

బీఐఎస్‌ ప్రమాణాలతో తయారు చేసిన విద్యుత్‌ ఉపకరణాలను వినియోగించకపోవడం, అనుభవజ్ఞులైన ఎలక్ట్రీషియన్లతో విద్యుత్‌ వైరింగ్‌ పనులు చేయించకపోవడం, అతుకులు వేసిన విద్యుత్‌ తీగలను దీర్ఘకాలం అలాగే వదిలేయడం, లూజ్‌ వైరింగ్‌ తదితర కారణాలు అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇళ్లలో ఇరుకుగా ఉండే చోట ఫ్రిజ్‌లు, మైక్రోవేవ్‌ ఓవెన్లను ఉంచడం వల్ల కూడా మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. ఎక్కువ ఓల్టేజీ ఉన్న విద్యుత్‌ ఉపకరణాల కోసం నాణ్యమైన 3 పిన్‌ సాకెట్లు వినియోగించకుంటే షార్ట్‌సర్క్యూట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీడీలు సిగరెట్లు తాగి గడ్డివాములు, పూరిళ్లపై వేయడం, వంట చేసేటప్పుడు మంటలు చెలరేగితే అజాగ్రత్తగా వ్యవహరించడం అగ్ని ప్రమాదాలకు మరో కారణం.

ఇటీవల యర్రగొండపాలెం మెయిన్‌ సెంటర్‌లోని ఓ వస్త్ర దుకాణం క్షణాల వ్యవధిలో కాలి బూడిదైంది. రాత్రి వేళ దుకాణం మూసి ఇంటికెళ్లిన కాసేపటికే విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసినా అప్పటికే రూ.4 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. జిల్లాలో పొదిలి వేలం కేంద్రం పరిధిలోని పొగాకు బ్యారన్లు తరచూ బుగ్గిపాలై రైతులకు తీవ్ర నష్టం మిగుల్చుతున్నాయి. క్యూరింగ్‌ సమయంలో రైతులు అప్రమత్తంగా లేకపోవడం, అల్లిక కర్రలు సక్రమంగా ఉంచకపోవడం వల్ల బ్యారన్లు తగలబడిపోతున్నాయి.

అగ్ని ప్రమాదాలు

కాపాడిన ఆస్తి విలువ

(రూ.కోట్లలో)

సంవత్సరం

ఆస్తి నష్టం

(రూ.కోట్లలో)

2020–21 380 7.39 5.79

2021–22 250 1.61 3.39

2022–23 236 3.09 8.15

2023–24 295 2.39 8.45

2024–25 338 2.49 7.25

2025–26 155 1.67 7.42

అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. పాఠశాలలు, ఆస్పత్రులు, అపార్ట్‌మెంట్లు,

ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలు.. ఇలా వివిధ ప్రాంతాల్లో ప్రజలకు ప్రమాదాల నివారణ, ఆస్తి,

ప్రాణ నష్టం తగ్గించడంపై అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ, ‘మనం ఎంత అప్రమత్తంగా ఉన్నాం’ అనేదే ప్రధాన ప్రశ్న. ఇళ్లు, కార్యాలయాలు, వ్యవసాయ క్షేత్రాలు, దుకాణాల్లో సంభవిస్తున్న

అగ్నిప్రమాదాలకు మానవ తప్పిదాలే

కారణభూతంగా నిలుస్తున్నాయన్నది కాదనలేని వాస్తవం. అజాగ్రత్త, నిర్లక్ష్యం, ఏమరపాటుగా ఉండటం వల్ల

ఊహించని రీతిలో మంటలు

చెలరేగి ఆస్తులు బుగ్గిపాలవుతున్నాయి.

వేసవిలో మరింత అప్రమత్తత అవసరం జిల్లాలో గత ఆరేళ్లలో 1654 అగ్ని ప్రమాదాలు

18.64 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత

Advertisement
 
Advertisement
Advertisement