● మరొకరికి గాయాలు
పామూరు: బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం మండలంలోని నుచ్చుపొదవద్ద 167బీ జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని బోడవాడ గ్రామానికి చెందిన దొడ్డా వేణుగోపాల్ భార్య, కుమారుడుతో కలిసి సొంత పనిపై పామూరు వస్తున్నారు. వీరు నుచ్చుపొద సమీపంలోకి వచ్చే సరిగా మోటార్‌బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కన పొలాల్లోకి వేగంగా బోల్తాకొట్టింది. ఘటనలో దొడ్డా వేణుగోపాల్ తలకు తీవ్రగాయాలు, కుమారుడు కౌషిక్ తలకు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని వారు 108 వాహనానికి సమాచారం ఇఇచ్చారు. 108 సిబ్బంది ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వేణుగోపాల్(35) మృతిచెందాడు. అతని కుమారుడు కౌషిక్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. భర్త మృతితో భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. వేణుగోపాల్ మృతితో బోడవాడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


