న్యూస్‌రీల్
అందుకే మండేది
వేసవిలో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువ. ఏమరపాటు, అజాగ్రత్త, నిర్లక్ష్యంతోనే ఎక్కువ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి.
పొగాకు రైతులను కొనుగోలు కంపెనీలు ముంచేస్తున్నాయి. రెండేళ్లుగా వేలం కేంద్రాల్లో అమ్మకాలను పరిశీలిస్తే అవుననే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. వ్యాపారులు కొన్నదే నాణ్యమైన పొగాకు..వారు ఇచ్చిందే రేటు అన్నరీతిలో దోపిడీ చేస్తున్నారు. రైతుల వద్ద పొగాకు ఉత్పత్తులు ఉన్న సమయంలో రేట్లు పెంచకుండా వేలం చివరి దశలో అన్నీ అమ్ముకున్న తరువాత రేట్లు పెంచుతూ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది వేలాన్ని పరిశీలించినా, ప్రస్తుతం చివరి దశలో ఉన్న కర్ణాటక పొగాకు వేలాన్ని పరిశీలించినా వేలంలో వ్యాపారులు చేస్తున్న మోసం అర్థమవుతుంది. ప్రస్తుతం ఇక్కడ గ్రేడ్–1 కిలో పొగాకుకు రూ.250 ఇస్తుండగా, అదే చివరి దశలో ఉన్న కర్ణాటక మార్కెట్‌లో మాత్రం రూ.320ల వరకు ఇస్తున్నారు. వ్యాపారులకు ఒక వైపు పాలకుల అండ, మరో వైపు బోర్డు అధికారులతో కుమ్మక్కు వెరసి రైతులు దగా పడుతున్నాడు. ఆర్థికంగా కుదేలై నష్టాల పాలవుతున్నాడు.


