కలెక్టరును కలిసిన ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

కలెక్టరును కలిసిన ఎస్పీ

Apr 23 2026 8:12 AM | Updated on Apr 23 2026 8:12 AM

కలెక్టరును కలిసిన ఎస్పీ ప్రైవేటు స్కూల్స్‌ టీసీ ఇవ్వకుంటే గుర్తింపు రద్దు

మార్కాపురం: మార్కాపురం జిల్లా కలెక్టర్‌ ఎం విజయసునీతను ఇన్‌చార్జి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు బుధవారం మార్కాపురం కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి మార్కాపురం వచ్చిన ఎస్‌పీ ఆమెను కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు.

మార్కాపురం టౌన్‌: విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తే ఆయా పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని డీఈఓ రేణుక హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ప్రైవేటు స్కూల్స్‌లో చదివే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి ప్రైవేటు పాఠశాలలపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అంతేకాక గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement