కౌలు రైతు సంఘ జిల్లా అధ్యక్షునిగా చావా కోటేశ్వరరావు | - | Sakshi
Sakshi News home page

కౌలు రైతు సంఘ జిల్లా అధ్యక్షునిగా చావా కోటేశ్వరరావు

Apr 23 2026 8:12 AM | Updated on Apr 23 2026 8:12 AM

పలువురు సీఐల బదిలీ

ఒంగోలు టౌన్‌: జిల్లాలో పోలీసు శాఖలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. జిల్లా కేంద్రం ఒంగోలు వన్‌టౌన్‌ సీఐగా సైబర్‌ క్రైం సీఐ వెంకటేశ్వర్లును నియమిస్తూ గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పని చేస్తున్న నాగరాజును వీఆర్‌కు పంపించారు. ట్రాఫిక్‌ సీఐ జగదీష్‌ను వీఆర్‌కు పంపించి ఆయన స్థానంలో సింగరాయకొండ సీఐ హాజరత్తయ్యను నియమించారు. కొండపి సీఐ సోమశేఖర్‌ ను చీరాల ఒన్‌టౌన్‌కు బదిలీ చేశారు. అయితే ఈ రాత్రికి మరికొన్ని బదిలీలు, మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఒంగోలు టౌన్‌: కౌలు రైతు సంఘ ప్రకాశం జిల్లా అధ్యక్షునిగా చావా కోటేశ్వరరావు, కార్యదర్శిగా వి.బాలకోటయ్య ఎన్నికయ్యారు. ఎల్బీజీ భవనంలో బుధవారం నిర్వహించిన జిల్లా మహాసభల్లో నూతన కమిటీ ఎంపికై ంది. ఉపాధ్యక్షునిగా బి.రమేష్‌, సహాయ కార్యదర్శిగా ఏ.సురేష్‌, కమిటీ సభ్యులుగా రామాంజనేయులు, పేతురు, మీరాసు, కమల్‌ ప్రేమ్‌ కుమార్‌, జాన్‌, రాంబాబులను ఎన్నుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement