కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేయాలి

Apr 23 2026 8:12 AM | Updated on Apr 23 2026 8:12 AM

ప్రస్తుతం పొగాకు మార్కెట్‌ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వ్యాపారులు ధరలు పెంచడం లేదు. ఇటువంటిి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు నేరుగా వేలంలో పాల్గొని కొనుగోలు చేస్తే అప్పుడే వ్యాపారులు ధరలు పెంచుతారు. రూ.250లతో వేలం ప్రారంభిస్తే సరాసరి ధర చివరికి వచ్చే సరికి క్వింటా రూ.20 వేల కంటే దిగువకు వస్తుంది. దీన్ని వల్ల రైతులకు కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ప్రభుత్వాలు మేల్కొని పొగాకు రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి.

– మాదాల రమణయ్య, రైతు సంఘం నాయకుడు

సరాసరి ధరలు పడిపోకుండా చూడాలి

వేలం ప్రారంభంలోనే క్వింటాకు రూ.25 వేలు ఇస్తే వేలం చివరికి వచ్చే సరికి అది రూ.15 వేలకు పడిపోయినా ఆశ్చర్యం లేదు. ఏదో కొన్ని బేళ్లకు చివరిలో ధరలు ఇచ్చి రైతులను మోసం చేయడం సరైన విధానం కాదు. రెండేళ్లుగా వ్యాపారులు ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ ఏడాది పొగాకు రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుంది.

– కట్టా హనుమంతరావు, పొగాకు రైతు

Advertisement
 
Advertisement
Advertisement