త్రిపురాంతకం: చంద్రబాబు ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రంలోని టీడీపీ నాయకులు జేబులు నింపుకునే విధంగా పరిపాలన సాగిస్తోందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. త్రిపురాంతకం మండలం సంఘం తండాలో నీలంపాటి అమ్మవారి తిరునాళ్లలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన వేదికపైనుంచి ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా కొత్త రేషన్‌కార్డు, కొత్త పెన్షన్ మంజూరు కాలేదని మండిపడ్డారు. ఒక్క ఇల్లు మంజూరు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. గత వైఎసా్‌స్‌ర్ సీపీ ప్రభుత్వంలో అనేక పథకాలను ఇంటి ముంగిటకే అందించిన ఘనత ఆనాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. నేడు కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగినా పలికేవారు లేరన్నారు. రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టారని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సమస్యలను విస్మరించారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే తాటిపర్తి అన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా వైఎస్సార్ సీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరూ ఒకే జెండా కింద పనిచేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అంకిత భావంతో కృషి చేయాలని కోరారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, పార్టీ కార్యకర్తలు, నాయకులపై పెట్టే అక్రమ కేసులకు భయపడమని, చట్టబద్ధంగా ఎదుర్కొంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిందేనని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ స్థానిక నాయకులు రామావత్ సక్రునాయక్, బాలునాయక్, రాజానాయక్, బాలాజీ నాయక్, పి.లాల్, శాసం రంగబాబు, ఆళ్ల కృష్ణారెడ్డి, మురారి గాలెయ్య, భవనం వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం
ఎన్నికల హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్


