అట్టహాసంగా ఎడ్ల పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా ఎడ్ల పోటీలు ప్రారంభం

Apr 22 2026 9:18 AM | Updated on Apr 22 2026 9:18 AM

అట్టహాసంగా ఎడ్ల పోటీలు ప్రారంభం వ్యక్తికి తీవ్రగాయాలు

నాగులుప్పలపాడు: ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను నాగులుప్పలపాడు మండలంలోని మద్దిరాలపాడు గ్రామంలో సోమవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభించారు. మండవ వెంకట్రావు మెమోరియల్‌ ఆధ్వర్యంలో గుమ్మడి సాయిబాబా ఏర్పాటు చేసిన ఈ పోటీలను సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ ప్రారంభించి మాట్లాడారు. మొదటి రోజు రెండు పళ్ల విభాగంలో మొత్తం 9 జతల ఎడ్లు పాల్గొనగా, వాటికి బండలాగడానికి సరాసరిన 10 నిమిషాల సమయం కేటాయించారు. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన బెల్లం రోశయ్య, పున్నమ్మ మెమోరియల్‌ ఎడ్ల జత 3029 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం కావూరి లింగంగుంట గ్రామానికి చెందిన ఎంకేఆర్‌ బుల్స్‌ 3000 అడుగుల దూరం లాగి 2వ స్థానం కై వసం చేసుకుంది. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం అక్కినేడి గ్రామానికి చెందిన విజయలక్ష్మి నాయుడు ఎడ్ల జత 2715 అడుగుల దూరం లాగి మూడో స్థానంలో నిలవగా, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన నక్కా బలరామకృష్ణమూర్తి ఎడ్ల జత 2706 అడుగుల దూరం లాగి 4వ స్థానంలో నిలిచింది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామానికి చెందిన గొల్లపూడి నాగేశ్వరరావు మెమోరియల్‌ ఎడ్ల జత 2701 అడుగుల దూరం లాగి 5వ స్థానంలో, మార్కాపురం జిల్లా కొమరోలు మండలం పామూరుపల్లె గ్రామానికి చెందిన కామూరి రమణారెడ్డి, నీలకంఠేశ్వరరెడ్డి ఎడ్ల జత 2700 అడుగుల దూరం లాగి 6వ స్థానంలో, గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిక గ్రామానికి చెందిన కేఎన్‌ఆర్‌ మెమోరియల్‌ ఎడ్ల జత 2617 అడుగుల దూరం లాగి 7వ స్థానంలో నిలిచాయి. అదేవిధంగా పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన కాకాని హనుమయ్య మెమోరియల్‌ ఎడ్ల జత 2488 అడుగుల దూరం లాగి 8వ స్థానంలో, ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కుందుర్తి గ్రామా నికి చెందిన మాదాల శ్రీధర్‌ మెమోరియల్‌ ఎడ్ల జత 2381 అడుగుల దూరం లాగి 9వ స్థానంలో విజేతలుగా నిలిచాయి. కార్యక్రమంలో పీడీసీసీబీ చైర్మన్‌ కామేపల్లి సీతారామయ్య, గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ ముప్పవరపు సుచిత్ర, మండవ రవి, పోతినేని శ్రీనివాసరావు, చిన్న, పున్నారావు తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి వరుసగా రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.12 వేలు, రూ.10 వేలు, రూ.9 వేలు, రూ.8 వేలు, రూ.7 వేలు బహుమతులుగా అందజేశారు.

పీసీపల్లి: బైకు అదుపుతప్పి కింద పడటంతో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈఘటన సోమ వారం పీసీపల్లి పీహెచ్‌సీ ఎదురుగా చోటుచేసుకుంది. మండలంలోని గుదేవారిపాలెం గ్రామానికి చెందిన జొన్నవరపు మధు సొంత పనిమీద చింతగుంపల్లి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. సరిగ్గా పీసీపల్లి ఆసుపత్రి సెంటర్‌ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బైక్‌ అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో కనిగిరి వైద్యశాలకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement