పారిశుధ్య కార్మికులకు జనవరి జీతాలు ఇచ్చారు. ఫిబ్రవరి, మార్చి బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని నెలకోసారి డ్యూటీలు మార్చేలా ఎంఓయూలో ఒప్పందం చేసుకున్నట్లు ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. 15 రోజులకోసారి డ్యూటీలు మార్చడం వలన గందరగోళం నెలకొనే అవకాశం ఉన్నట్లు ఏజెన్సీ భావిస్తున్నట్లుంది. పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇస్తాం.
– డాక్టర్ మాణిక్యరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్


