మనువాదానికి వ్యతిరేకంగా కళారూపాలు నిర్మించాలి | - | Sakshi
Sakshi News home page

మనువాదానికి వ్యతిరేకంగా కళారూపాలు నిర్మించాలి

Apr 20 2026 7:18 AM | Updated on Apr 20 2026 7:18 AM

ఒంగోలు టౌన్‌: సామాన్య మనుషులను అనాగరిక సమాజానికి దగ్గర చేస్తున్న మనువాద కార్పొరేట్‌ సంస్కృతికి వ్యతిరేకంగా కవులు, కళాకారులు ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిని నిర్మించాలని ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఖాసిం పిలుపునిచ్చారు. నగరంలోని ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో ఆదివారం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. చొప్పర జాలన్న అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖాసీం మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు అధికారంలోకి రాగానే మరింత వేగంగా ఫాసిజం విస్తరిస్తోందని చెప్పారు.

అరుణోదయ సమాఖ్య నూతన కమిటీ ఎంపిక:

అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడిగా చొప్పర జాలన్న తిరిగి ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సన్నశెట్టి రాజశేఖర్‌, సి.నాగరాజు, కాకర్ల అప్పారావు, డి.అంజయ్య, కె.నిర్మల, యస్‌.సోమేశ్వరరావు, శంబుడు జయలక్ష్మి తోపాటుగా కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. సమావేశంలో సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసి రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి సీఎస్‌ సాగర్‌, పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌. మోహన్‌, ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు నాంచా ర్లు, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌.రాజశేఖర్‌, కళాకారులు మెడసల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement