పొదిలి: ఉమ్మడి ప్రకాశం జిల్లా మీసేవ నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పొదిలికి చెందిన మీ సేవ నిర్వాహకులు సానికొమ్ము వెంగళరెడ్డి కమిటీ నూతన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. స్థానిక ఫంక్షన్ హాలులో ఉమ్మడి ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా సురేష్, కార్యదర్శిగా మారాబత్తుని వెంకట సురేష్, శేఖర్, జనరల్ సెక్రటరీగా చిరంజీవి, కోశాధికారిగా రామాంజనేయులు, స్టేట్ కమిటీ సభ్యులు అవ్వారి వెంకట రాయలు ఎన్నికయ్యారు. ముందుగా నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రాము మాట్లాడుతూ మీసేవ నిర్వాహకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ సురేష్, కోశాధికారి రమణారావు, యాసిన్, మీసేవ మిత్రలు పాల్గొన్నారు.


