సత్యమేవ జయతే
19-4-2026
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
లింగసముద్రం: స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన విద్యార్థి నీటిలో మునిగి మృతిచెందిన సంఘటన లింగసముద్రం మండలంలోని జంపాలవారిపాలెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..జంపాలవారిపాలెం గ్రామానికి చెందిన గడ్డం వినయ్‌బాబు (12) కందుకూరులో 7వ తరగతి చదువుతూ పరీక్షలు రాసి ఇంటికొచ్చాడు. గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి లింగసముద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకా నర్సయ్య కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. నీటిలో మునుగుతుండగా లోతు ఎక్కువగా ఉండటంతో వినయ్‌బాబు మునిగిపోయి ఊపిరాడక మృతి చెందాడు. గురువారం నుంచి వినయ్‌బాబు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఎస్సై రాంబాబు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన వినయ్‌బాబు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందినట్లు నిర్ధారించారు. శనివారం ఉదయం వాకా నర్సయ్య కుంట వద్ద గజ ఈతగాళ్లను పిలిపించి మృతదేహాన్ని వెలికితీశారు.
www.sakshi.com


