జనగణనలో ఓటీపీ అడగరు | - | Sakshi
Sakshi News home page

జనగణనలో ఓటీపీ అడగరు

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

ఒంగోలు టౌన్‌: జనగణన ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ, బ్యాంక్‌ ఖాతా వివరాలు, వ్యక్తిగత గోప్య సమాచారం, సర్టిఫికెట్లు అడగరని ఎస్పీ హర్షవర్థన్‌రాజు తెలిపారు. జనగణన పేరుతో డిజిటల్‌ ప్లాట్‌ఫాంల ద్వారా మోసాలకు పాల్పడే వ్యక్తుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. సోషల్‌ మీడియా, ఫోన్‌ కాల్స్‌, ఇతర మార్గాల ద్వారా ఎవరైనా ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారం అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని చెప్పారు. ఈ నెల 16వ తేదీ ప్రారంభమైన జనగణన 30వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. స్వయంగా ఇళ్ల గణన మొదటి దశ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మే 1 నుంచి 30వ తేదీ వరకు ఇళ్ల గణన ప్రక్రియ నిర్వహించనున్నట్లు చెప్పారు. స్వయం గణన ప్రక్రియలో ప్రతిఒక్కరూ భారత జనగణన పోర్టల్‌లో లాగిన్‌ అవ్వాలని, అందులో అడిగిన వివరాలు నమోదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో సెన్సస్‌ ఇన్‌చార్జి ఆఫీసర్‌ టి.రాంభూపాల్‌రెడ్డి, మాస్టర్‌ ట్రైనర్‌ అఖండ కుమార్‌, సెన్సస్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ టి.సుజాత పాల్గొన్నారు.

ఎస్పీ హర్షవర్థన్‌రాజు

Advertisement
 
Advertisement
Advertisement