శుక్రవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

Apr 17 2026 10:56 AM | Updated on Apr 17 2026 10:56 AM

శుక్రవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

పల్లెలకు పాకిన గంజాయి...

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పట్టుబడిన గంజాయి కేసులను గమనిస్తే ఎక్కువగా మారుమూల గ్రామాలకు సైతం విక్రయాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పశ్చిమం, తూర్పు అని చూడకుండా ఏ ప్రాంతంలో కావాలంటే ఆ ప్రాంతంలో గంజాయి పబ్లిగ్గా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 2వ తేదీ కొండపి, అనమర్లపూడి గ్రామాల మధ్య గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో మర్రిపూడి మండలం వేమవరం గ్రామానికి చెందిన కందమల్ల నారాయణ, చీమకుర్తి మండలం బూసరపల్లి గ్రామానికి చెందిన షేక్‌ నాగుర్‌వలి, చీమకుర్తి గ్రామానికి చెందిన షేక్‌ రఫీ, బత్తుల సిద్దూలు ఒడిశాకు చెందిన రాజేష్‌ నాయర్‌తో కలిసి చీమకుర్తిలో విక్రయించడానికి తీసుకెళ్తున్న 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మార్చి 10వ తేదీ గిద్దలూరు మండలం కేఎస్‌ పల్లి గ్రామానికి చెందిన అలమూరి చంద్రయ్య, డిగపాటి వెంకటేష్‌, వెంగళ్‌రెడ్డిపల్లె గ్రామానికి చెందిన బిజ్జం శ్రీరాంరెడ్డిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనిని బట్టి చూస్తే జిల్లాలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న విషయం బట్టబయలవుతోంది.

ఉమ్మడి జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణం దగ్గర నుంచి పల్లెల వరకూ గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇటీవల నమోదైన కేసులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. విజనరీ పాలనలో పొరుగు ప్రాంతాల నుంచి వలస వస్తున్న గంజాయికి సామాన్యులు, విద్యార్థులు బానిసలుగా మారుతున్నారు. కొన్నిచోట్ల వారు విక్రేతలుగా మారుతున్నారు. అమాయకులైన కళాశాల, హైస్కూలు స్థాయి విద్యార్థులను ఆకట్టుకోవడానికి గంజాయి చాక్లెట్లు, సిగరెట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. చీకటి వ్యాపారాన్ని కట్టడి చేయాల్సిన పాలకులు ఆర్భాటపు ప్రకటనలతో సరిపుచ్చుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మత్తు చాక్లెట్లు...

చీమకుర్తి అంటేనే గ్రానైట్‌ వ్యాపారానికి ప్రసిద్ది. ఇక్కడకు ఎక్కడెక్కడి నుంచో కూలీలు వచ్చి పనులు చేస్తూ పొట్టపోసుకుంటుంటారు. వలస కూలీలపై దృష్టి పెట్టిన గంజాయి మాఫియా చీమకుర్తిని అడ్డాగా చేసుకుని జోరుగా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 9వ తేదీ చీమకుర్తి మండలం బూదవాడ గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న ఒడిశాకు చెందిన ప్రశాంత్‌ను ఎకై ్సజ్‌ అధికారులు అరెస్టు చేశారు. గ్రామంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కిరాణా దుకాణం ముసుగులో గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు అధికారులు కేసు నమోదు చేశారు. ప్రశాంత్‌ దుకాణంలో 800 గ్రాముల గంజాయితో పాటు గంజాయితో చేసిన 800 చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్లతో పాటుగా సిగరెట్లను కూడా జిల్లా కేంద్రమైన ఒంగోలులో రహస్యంగా విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement