దివ్యాంగుడిపై టీడీపీ నేతల దాడి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుడిపై టీడీపీ నేతల దాడి

Mar 28 2026 7:29 AM | Updated on Mar 28 2026 7:29 AM

తాళ్లూరు: గ్రామాల్లో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇందుకు తూర్పు గంగవరం పంచాయతీ పరిధిలోని సోమవరప్పాడులో జరిగిన ఘటనే తాజా ఉదాహరణ. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన యద్దల సురేష్‌ దివ్యాంగుడు. దీంతో తాగునీటి కోసం తన ఇంటి వద్దకు నీటిని సరఫరా చేసేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాడు. అనంతరం ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ అనుమతితో మంగళవారం కోటయ్య అనే వ్యక్తి సాయంతో ఇంటి వద్దకు నేరుగా పైపులతో కుళాయి ఏర్పాటు చేయిస్తున్నాడు. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులైన సానే సురేష్‌, యమ్మని వెంకటేశ్వర్లు అక్కడికి వచ్చి ఎవరు అనుమతి తీసుకొని కుళాయి ఏర్పాటు చేస్తున్నావని ప్రశ్నించారు. కలెక్టర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ అనుమతి తీసుకున్నానని సురేష్‌ చెప్పగా.. శ్రీ ఈ గ్రామంలో ఏం చేయాలన్నా మా అనుమతి తీసుకోవాల్సిందేనశ్రీని పనులను అడ్డుకున్నారు. ఏ పని చేయాలన్నా మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఆ తరువాత దుర్భాషలాడుతూ దాడి చేశారని సురేష్‌ వాపోయాడు. అడ్డుగా వచ్చిన నా తల్లిపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే ఎస్సై లేరని నాలుగు రోజుల నుంచి పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిప్పుకున్నారని తెలిపాడు. ప్రస్తుతం ఒంగోలులోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నానని, గంగమ్మ తిరునాళ్ల లోపు చంపేస్తామని బెదిరిస్తున్నారని, నాకు ప్రాణ హానీ ఉందని, నాకు ఏనదైనా జరిగితే సానే సురేష్‌, సానే ఆంజనేయులు, యమ్మని వెంకటేశ్వర్లు బాధ్యులని తెలిపాడు.

తాగునీటికి కుళాయి వేయిస్తుండగా దౌర్జన్యం

మా అనుమతి లేకుండా ఎలా

వేస్తున్నావంటూ బెదిరింపు

బాధితుడి తల్లిపై అసభ్య ప్రవర్తన

హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న

బాధితుడు

పోలీసులకు ఫిర్యాదు చేసినా

పట్టించుకోవడం లేదని ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement