వెలుగురేఖ!
గిరిజన తండాలో అభివృద్ధి వెలుగులు అప్పటి వరకు పడిన కష్టాలు జగన్ పాలనతో దూరం నవరత్నాలతో చెంతకు సంక్షేమ ఫలాలు సచివాలయ వ్యవస్థతో తీరిన కష్టాలు నల్లమల గిరిజన గూడేల్లో వెలుగు రేఖలు
గిరి గుండెల్లో..
యర్రగొండపాలెం:
నల్లమల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే పెద్ద పీఆర్సీ తాండా నుంచి ఏ చిన్న సమస్య వచ్చినా 25 కిలో మీటర్లు వెళ్లాల్సిందే. గిరిజన తాండా వాసులు పడే కష్టాలు వర్ణనాతీతం. పింఛన్ కావాలన్నా, రేషన్ కోసం అర్జీపెట్టుకోవాలన్నా మండల కేంద్రం యర్రగొండపాలెంకు పరుగులు తీయాలి. ముందు 4 కిలోమీటర్లు కాలినడక, ఆ తరువాత రెండు బస్సులు మారాల్సి వచ్చేది. అలా 25 కిలో మీటర్లు ప్రయాణం చేసేందుకు అష్టకష్టాలు పడేవారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక పెద్ద పీఆర్సీ తాండా వాసుల కష్టాలు ఒక్కొక్కటిగా గట్టెక్కుతూ వచ్చాయి. జగన్ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా సమస్యలు స్థానికంగానే పరిష్కరమవుతూ వచ్చాయి. వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. నవరత్నాల పథకాలను గిరిజనుల ఇంటి ముందుకే చేరేలా చేశారు. కరోనా మహమ్మరి వెంటాడడంతో కష్టాలు తప్పవనుకున్నాం. ఆ మహమ్మరి బారిన పడకుండా కాపాడటమేకాకుండా ఎటువంటి కష్టాలు లేకుండా చేశారంటూ ఆ తాండా వాసులు జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. శ్ఙ్రీదేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలైనా గిరిజనుల జీవితాల్లో మార్పులేదు. పాలకులు చిన్న చూపు చూస్తూనే వచ్చారు. తండాలను ఎవరూ పట్టించుకునేవారు కాదు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల్లో ఉన్న పేదలతోపాటు సభ్యసమాజానికి దూరంగా, అటవీ ప్రాంతాల్లో జీవించే గిరిజనులను ఆయన గుర్తించారని పెద్ద పీఆర్సీ తండాకు చెందిన పలువురు పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత కాలం తిరోగమనం అయినట్లు ఉందని, తిరిగి తాము కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందని, ఎటువంటి సంక్షేమ పథకాలు తమ దరిచేరడంలేదని వారు ఆవేదన వ్యక్తపరిచారు. తమ సమస్యలను పట్టించుకునేనాథుడేలేడని, సచివాలయం వద్దకు వెళ్తే వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుంటారని, ఏదైనా సమస్య ఉంటే ముందుగా తమ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడితో కలవాలని, లేకుంటే అధికారులు సైతం ఆ సమస్యను పక్కన పెట్టేస్తున్నారని వారు విమర్శించారు.
గ్రామాభివృద్ధికి చిరునామా ఆరవీటికోట
రాచర్ల: మండలంలోని ఆరవీటికోట గ్రామం నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలోని ఉన్న మారుమూల ప్రాంతం. మండల కేంద్రానికి సుమారు 15 కిలో మీటర్ల దూరం ఉంటుంది. గ్రామానికి వచ్చే రోడ్డు రాళ్లు, రప్పలతో అధ్వానంగా ఉండేది. అంబులెన్స్ రావాలంటే నానా ఇబ్బందులు పడేవారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకవీడు పంచాయతీ ప్రభుత్వ ఆస్పత్రికి రావాలి. గ్రామంలో అంతర్గత రోడ్లన్నీ మట్టిరోడ్లుగా ఉండేవి. 2019లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎం కావడంతో ఆరవీటికోట గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గ్రామంలో ఎటు చూసినా అభివృద్ధి పనులే కనపడ్డాయి. నవరత్నాల్లో భాగంగా రూ.1.13 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా గ్రామ సచివాలయ భవన నిర్మాణం కోసం రూ.40 లక్షలు, రైతు భరోసా కేంద్రం రూ.21.80 లక్షలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ సెంటర్ భవన నిర్మాణం కోసం రూ.17.50 లక్షలు, స్కూల్ అభివృద్ధి కోసం నాడు–నేడు పథకం ద్వారా రూ.14 లక్షలు, గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్లు వేసేందుకు రూ.20 లక్షలతో అభివృద్ధి చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా, హెల్త్ క్లినిక్ భవనాలు నిర్మాణాలు చేసి అన్ని శాఖాల అధికారులను నియమించి, మండల కేంద్రానికి వెళ్లకుండానే గ్రామంలోనే అన్ని సదుపాయాలు కల్పించారని గ్రామస్తులు వివరించారు. ఒకప్పుడు ఆరవీటికోటకు రావాలంటే భయపడే బంధువులు నేడు ఆనందంగా వస్తున్నారని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
గిరిజనులకు ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేశారు
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే పేదవర్గాలను గుర్తించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరిచారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో నివశించే సుగాలి, చెంచు గిరిజనుల కష్టాలను తొలగించేందుకు తమ సమస్యలను తామే పరిష్కరించుకోవటానికి ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటుచేసి పుణ్యం కట్టుకున్నారు. జగనన్న మాకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. గిరిజన పంచాయతీ ఏర్పాటు చేయడంతోపాటు గూడెంలో సచివాలయం, హెల్త్ క్లీనిక్, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయించారు.
– దేశావత్ బాలునాయక్, పెద్ద పీఆర్సీ తండా
నా చిన్న కుమారుడికి ఉద్యోగం వచ్చింది
జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం వలన నా చిన్నకుమారుడికి వెటర్నరీ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. సచివాలయాలు ఏర్పాటు చేయకపోతే మేము పొలం పనులు చేసుకొని బతకాల్సిన పరిస్థితి. జగనున్న కాలంలో వలంటీర్లు మా ఇంటి వద్దకు వచ్చి సమస్యల గురించి అడిగేవారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించి అర్జీలు పెట్టించేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా పోయింది. గతంలో వచ్చిన పథకాలు ఏమయ్యాయో అర్థం కావడంలేదు. వాటిని ఎవరో దిగమింగుతున్నారనిపిస్తోంది.
– రామావత్ మత్రిబాయి, పెద్ద పీఆర్సీ తండా
వెలుగురేఖ!
వెలుగురేఖ!
వెలుగురేఖ!


