ప్రజల మనసుల్లో జగన్‌కు సుస్థిర స్థానం
మార్కాపురం రూరల్ (మార్కాపురం): నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందించి పేద ప్రజల సంక్షేమం, ఆర్ధిక అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారని మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. మండలంలోని ఇడుపూరు గ్రామంలో శనివారం రాత్రి వైఎస్ జగన్ ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చెంచిరెడ్డి, యార్డు మాజీ చైర్మన్ డీ గురుబ్రహ్మం, జవ్వాజి వెంకటరెడ్డి, బండి సుబ్బారెడ్డి, సాఫ్ట్‌వేర్ సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామసుబ్బారావు, నాసర్, దిబ్బారెడ్డి, జక్రయ్య, దానయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల భారీ ర్యాలీ..
టంగుటూరు: మండలంలోని వల్లూరు వద్ద పేస్ కాలేజీ విద్యార్థులు ద్విచక్ర వాహనాలతో ఒంగోలు నుంచి భారీ ర్యాలీ నిర్వహించి కాలేజీ సమీపంలో భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా విద్యాప్రదాత జగన్‌మోహన్ రెడ్డి అని నినాదాలు చేశారు. ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చుండూరి రవిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకరరావు, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాత నరసింహ గౌడ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్ర రెడ్డి, విద్యార్థి విభాగం నగర ప్రెసిడెంట్ శ్రీకాంత్ పాల్గొని కేక్ కట్ చేశారు.
ప్రజల మనసుల్లో జగన్‌కు సుస్థిర స్థానం


