జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక
టంగుటూరు: 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12,13,14 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో అండర్ 17 రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన మండలంలోని మర్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎ. అరుణ్‌కుమార్, గుమ్మా కీర్తన ప్రతిభ కనబరచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. వీరు జనవరి 6 నుంచి 9 వరకు చత్తీస్‌ఘడ్‌లో జరగనున్న జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయుడు చుండూరి చలపతి తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను పీడీ కౌసల్య, అచ్యుత్రావు, వెంకట్రావు, శ్రీనివాసులు, సునంద, పుష్పవల్లి, భాగ్యలక్ష్మి, సుమ, సుభాషిణి, సుధీర్, సుబ్రహ్మణ్యం, గ్రామస్తులు అభినందించారు.
కంభం: మండలంలోని పలు ఎరువుల దుకాణాలను బుధవారం స్థానిక వ్యవసాయాధికారి మహమ్మద్‌తో కలిసి కనిగిరి ఏడీఏ తనిఖీ చేశారు. ఎరువుల నిల్వ రిజిస్టర్లు, బిల్ బుక్‌లను పరిశీలించారు. ఓ–ఫారం లైసెన్‌లో పొందుపరచని కారణంగా రూ.6.75 లక్షల విలువైన ఎరువులను సీజ్ చేశారు.
జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక


