టంగుటూరులో వ్యక్తి దారుణ హత్య
టంగుటూరు: టంగుటూరులో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన స్థానిక వడ్డెపాలెంలో మంగళవారం రాత్రి జరగ్గా..బుధవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం...టంగుటూరు వడ్డెపాలెంలో నివాసం ఉంటున్న యనమనమంద వెంకట రమణయ్య(50) స్థానిక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో రమణయ్య ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు తలుపు తీసి చూడగా మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్సై నాగమల్లీశ్వరరావు, జరుగుమల్లి ఎస్సై మహేంద్రలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీం సంఘటనా స్థలికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించారు. మృతుని తల, గొంతపై ఐదు బలమైన గాయాలను గుర్తించారు. హైదరాబాద్‌లో నివాసం ఉండే మృతుని కుమారుడు, బంధువులు మంగళవారం రాత్రి నుంచి ఫోన్ చేస్తున్నా స్పందించడం లేదు. దీంతో మృతుని కుమారుడు తన స్నేహితులను ఇంటికి పంపించగా మృతదేహాన్ని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా ప్రాంతాన్ని అణువణువు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ రైల్వేస్టేషన్ వరకు వెళ్లి ఆగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని భార్య 2016లో మృతి చెందారు. కుమారుడు, కుమార్తె ఉండగా వారికి వివాహమైంది. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హత్యకు సంబంధించి ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లభించలేదన్నారు. దొంగతనం చేయడానికి వచ్చి హత్య చేశారా..వేరే ఇతర కారణాలతో హత్య జరిగింది అన్న కోణంలో విచారిస్తున్నామని తెలిపారు. కేసుకు సంబంధించి నాలుగు టీంలను రంగంలోకి దించి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు. వ్యక్తి హత్యతో టంగుటూరులో కలకలం రేగింది.
రెండు రోజుల తరువాత వెలుగులోకి
మృతుడు ప్రైవేట్ బ్యాంకు సెక్యూరిటీ గార్డు
టంగుటూరులో వ్యక్తి దారుణ హత్య
టంగుటూరులో వ్యక్తి దారుణ హత్య


