సీఎం సమీక్షలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ
ఒంగోలు సబర్బన్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో గురువారం రెండో రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్‌రాజు పాల్గొన్నారు. బుధవారం మొదటి రోజు సీఎం సమీక్షకు కలెక్టర్లు మాత్రమే హాజరవగా, రెండో రోజు కలెక్టర్‌తో పాటు ఎస్పీ కూడా పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించిన నివేదికలతో వారు హాజరయ్యారు.
ఒంగోలు సిటీ: స్థానిక సమగ్ర శిక్ష కార్యాలయంలో ఒంగోలు డివిజిన్ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు, సీఆర్‌ఎంటీఎస్‌లకు సోషల్ ఆడిట్‌పై గురువారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ దాసరి అనీల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ నాటికి జిల్లాలో సోషల్ ఆడిట్ పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సోషల్ ఆడిట్ నోడల్ ఆఫీసర్ సోనీ రూత్, ఎం.జాలరత్నం, ప్లానింగ్ కో ఆర్డినేటర్ పి.నాగేంద్ర నాయక్, రిసోర్స్ పర్సన్లు హరిబాబు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
● ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జేసీ గోపాలకృష్ణ సమీక్ష
ఒంగోలు సబర్బన్: తల్లితండ్రి లేని పిల్లలను అనాథ పిల్లలుగా కాకుండా మన సొంత పిల్లలుగా భావిస్తూ వారిని తీర్చిదిద్దే బాధ్యత మనదే అని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల అధికారులతో గురువారం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఆయన చాంబర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని యాజమాన్యాల సీసీఐలలో ఉన్న పిల్లల రక్షణ, సంరక్షణ వివరాలను ఆయా సంస్థల ప్రతినిధులను అడిగి జాయింట్ కలెక్టర్ తెలుసుకున్నారు. పిల్లలకు వారు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సీసీఐలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా.. ఏవైనా అవసరాలున్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రతి సీసీఐలో ఉన్న ఆర్‌ఫాన్ అండ్ సెమీ ఆర్ఫాన్ పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్‌లు సమకూర్చాలని డీసీపీఓకు తెలిపారు. 8 సంవత్సరాలు దాటిన పిల్లలకు వారి కాళ్లపై వారు నిలబడేలా స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అందించాలని సూచించారు. అందుకు అన్ని డిపార్ట్‌మెంట్ల సహకారం అందించాలని కోరారు. అన్ని సీసీఐలలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత సీసీఐ వారికి తెలిపారు. జిల్లాలో అనధికారికంగా నిర్వహిస్తున్న ఏవైనా స్వచ్ఛంద సంస్థలను గుర్తించి వాటిపై తగు చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ సువర్ణ, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి.దినేష్ కుమార్, మిషన్ శక్తి కో ఆర్డినేటర్ ఇవంజిలిన్, సీసీఐ సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం సమీక్షలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ
సీఎం సమీక్షలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ


